NITD Recruitment: పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దుర్గాపూర్ వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 43
⏩ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II/ గ్రేడ్-I: 37 పోస్టులు
⏩ అసోసియేట్ ప్రొఫెసర్: 05 పోస్టులు
⏩ ప్రొఫెసర్: 01 పోస్టు
➥ విభాగం: బయోటెక్నాలజీ
స్పెషలైజేషన్..
1. ప్లాంట్ జెనెటిక్స్ మరియు హార్మోనల్ సిగ్నలింగ్
2. బయోకెమికల్ ఇంజినీరింగ్/ బయోప్రాసెస్ ఇంజినీరింగ్
3. బయోఇన్ఫర్మేటిక్స్
➥ విభాగం: సివిల్ ఇంజినీరింగ్
స్పెషలైజేషన్..
1. జియోమాటిక్స్
2. మల్టీస్కేల్-మల్టీఫిజిక్స్ మోడలింగ్
3. ఆఫ్‌షోర్ ఇంజినీరింగ్
➥ విభాగం: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్
స్పెషలైజేషన్..
1. బ్లాక్-చైన్ టెక్నాలజీ
2. సైబర్-ఫిజికల్ సిస్టమ్ మరియు సెక్యూరిటీ
3. క్వాంటం కంప్యూటింగ్
4. కంప్యూటర్ నెట్‌వర్క్
5. క్లౌడ్ కంప్యూటింగ్
➥ విభాగం: ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్
స్పెషలైజేషన్..
1. రిమోట్ సెన్సింగ్ మరియు GIS
2. స్ట్రక్చరల్ జియాలజీ
3. ఇంధన భూగర్భ శాస్త్రం
4. ఇగ్నియస్ పెట్రోలజీ మరియు జియోకెమిస్ట్రీ
5. అన్వేషణ భూగర్భ శాస్త్రం
6. అవక్షేప శాస్త్రం
7. మెటామార్ఫిక్ పెట్రోలజీ
8. వాయు కాలుష్యం మరియు నియంత్రణ
9. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్
➥ విభాగం: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
స్పెషలైజేషన్..
1. పవర్ ఎలక్ట్రానిక్స్ మరియు మెషిన్ డ్రైవ్‌లు
2. ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్ మరియు ఎంబెడెడ్ సిస్టమ్స్
3. పవర్ మరియు ఎనర్జీ సిస్టమ్స్
4. స్మార్ట్ గ్రిడ్
5. కండిషన్ మానిటరింగ్
6. సిగ్నల్ ప్రాసెసింగ్
➥ విభాగం: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్
స్పెషలైజేషన్..
1. కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు
2. చిప్ డిజైన్ & ఫ్యాబ్రికేషన్
3. టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్ వీఎల్‌ఎస్‌ఐ సర్క్యూట్స్
4. ఎంబెడెడ్ సిస్టమ్
5. పవర్ మేనేజ్‌మెంట్ IC డిజైన్
6. అనలాగ్/ డిజిటల్ IC డిజైన్
7. మైక్రోవేవ్
➥ విభాగం: హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్
స్పెషలైజేషన్..
1. సోషల్ వర్క్
➥ విభాగం: మేనేజ్‌మెంట్ స్టడీస్
స్పెషలైజేషన్..
1. సిస్టమ్స్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్
➥ విభాగం: మ్యాథమెటిక్స్
స్పెషలైజేషన్..
1. స్టాటిస్టిక్స్
2. ఆపరేటర్ థియరీ
3. ఆల్జీబ్రా
4. డిఫరెన్షియల్ జ్యామితి
5. టోపాలజీ
6. న్యూమరికల్ ఎనాలసిస్
7. ఆప్టిమైజేషన్ థియరీ
8. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్
9. నంబర్ థియరీ
10. న్యూమరికల్ లీనియర్ ఆల్జీబ్రా
➥ విభాగం: మెకానికల్ ఇంజినీరింగ్
స్పెషలైజేషన్..
1. మెషిన్ డిజైన్
2. కంప్యూటర్ ఎయిడెడ్ మాన్యుఫ్యాక్చరింగ్/ కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మానుఫ్యాక్చరింగ్
3. మైక్రోసిస్టమ్ టెక్నాలజీ
4. అడిటివ్ మానుఫ్యాక్చరింగ్
5. మెకాట్రానిక్స్
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 60 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.1500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
జీతం: అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II పోస్టులకు రూ.70900, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I పోస్టులకు రూ.101500, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.139600, ప్రొఫెసర్ పోస్టులకు రూ.159100.
మఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.04.2024
🔰 దరఖాస్తు హార్డ్‌కాపీలు పంపడానికి చివరి తేదీ: 10.05.2024.