NFL Engagement of Management Trainees 2024: నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లు, కార్యాలయాల్లో పనిచేయడానికి మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 164 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 2 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు చేపడతారు.
వివరాలు..
⫸ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
ఖాళీల సంఖ్య: 164.
పోస్టుల కేటాయింపు: యూఆర్ (జనరల్)-77, ఎస్సీ-22, ఎస్టీ-12, ఓబీసీ-40, ఈడబ్ల్యూఎస్-13.
విభాగాలవారీగా ఖాళీలు..
➥ కెమికల్: 56 పోస్టులు
➥ మెకానికల్: 18 పోస్టులు
➥ ఎలక్ట్రికల్: 21 పోస్టులు
➥ ఇన్‌స్ట్రుమెంటేషన్: 17 పోస్టులు
➥ కెమికల్ ల్యాబ్: 12 పోస్టులు
➥ సివిల్: 03 పోస్టులు
➥ ఫైర్ అండ్ సేఫ్టీ: 05 పోస్టులు
➥ ఐటీ: 05 పోస్టులు
➥ మెటీరియల్స్: 11 పోస్టులు
➥ హెచ్‌ఆర్: 16 పోస్టులు
అర్హతలు: పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా (పీజీడీఎం/ పీజీడీబీఎం)/ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 31.05.2024 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
పరీక్ష విధానం: ఆఫ్‌లైన్ (OMR) విధానంలో మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు విభాగాల నుంచి మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. ఇందులో ఒక సెక్షన్‌లో అభ్యర్థులకు సంబంధించిన సబ్జెక్టుల నుంచి 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. ఇక జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్/జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవు.
పే స్కేల్: నెలకు రూ.40,000 - రూ.1,40,000.
ముఖ్యమైన తేదీలు...
⫸ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 02.07.2024.
⫸ దరఖాస్తుల సవరణ: 04.07.2024 - 05.07.2024 వరకు.
ALSO READ:
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో 97 ఇంజినీర్, సీనియర్ కెమిస్ట్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
'నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్' సంస్థ ఇంజినీర్, సీనియర్ కెమిస్ట్ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 97 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్ 12న ప్రారంభంకాగా.. సరైన అర్హతలున్నవారు జులై 1 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..