EMRS Results: దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ (గురుకుల) పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షల ఫలితాలు జనవరి 22న విడుదలయ్యాయి. మొత్తం 10,391 బోధన, బోధనేతర సిబ్బంది భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్(NESTS) విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పీజీటీ, టీజీటీ, హాస్టల్ వార్డెన్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(JSA), ల్యాబ్ అటెండెంట్, అకౌంటెంట్ పోస్టులకు డిసెంబర్ 16, 17, 23, 24 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో అభ్యర్థులు రాసిన ఈ పరీక్షలో ఎంపికైన వారి వివరాలను పీడీఎఫ్ రూపంలో విడుదల చేసింది. 


ఫలితాల కోసం క్లిక్ చేయండి..


Website


దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల(EMRS)లో ఖాళీగా ఉన్న 10,391 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ప్రిన్సిపల్/ పీజీటీ/ జూనియర్‌ సెక్రెటేరియట్‌ అసిస్టెంట్/ ల్యాబ్‌ అసిస్టెంట్‌/ టీజీటీ/ హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. డిసెంబర్‌ 16, 17, 23, 24 తేదీల్లో ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్‌ నిర్వహించారు. తాజాగా పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని జనవరి 3న విడుదల చేశారు. ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం తాజాగా ఫలితాలను విడుదల చేశారు.


ఈఎంఆర్‌ఎస్ నియామక పరీక్ష ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..


దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల(ఈఎంఆర్‌ఎస్)లో ఖాళీగా ఉన్న 10,391 ఖాళీల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయంప్రతిపత్తి సంస్థ- నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (నెస్ట్స్‌) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిన్సిపల్/ పీజీటీ/ జూనియర్‌ సెక్రెటేరియట్‌ అసిస్టెంట్/ ల్యాబ్‌ అసిస్టెంట్‌, టీజీటీ/ హాస్టల్ వార్డెన్ పోస్టులకుగాను అర్హతలవారీగా డిగ్రీ, డిప్లొమా, పీజీ, డీఈడీ, బీఈడీ, సీటెట్‌ తదితర విద్యార్హతలున్న అభ్యర్థుల నుంచి అక్టోబర్‌ 19 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తాజాగా పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను నెస్ట్స్ విడుదల చేసింది. 


పోస్టుల వివరాలు..


మొత్తం ఖాళీలు: 10391


I. ఖాళీలు: 4062


పోస్టుల వారీగా ఖాళీలు..


1) ప్రిన్సిప‌ల్‌: 303 పోస్టులు 


అర్హత: బీఈడీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.


పని అనుభవం: కనీసం 12 ఏళ్లు పని అనుభవం ఉండాలి.


వయసు: 50 సంవత్సరాలకు మించకూడదు. 


జీతభత్యాలు: రూ.78,800-రూ.2,09,200.


2) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ): 2266 పోస్టులు


అర్హత: బీఈడీ, పీజీ డిగ్రీ/ ఎంఎస్సీ/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణత.


వయసు: 40 సంవత్సరాలకు మించకూడదు.


జీతభత్యాలు: రూ.47,600-రూ.1,51,100.


3) అకౌంటెంట్‌: 361 పోస్టులు


అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.


వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.


జీతభత్యాలు: రూ.35,400-రూ.1,12,400.


4) జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (JNA): 759


అర్హత: సీనియర్ సెకండరీ ఉత్తీర్ణులై ఉండాలి.


వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.


జీతభత్యాలు: రూ.19900-రూ.63200


5) ల్యాబ్‌ అటెండెంట్‌: 373


అర్హత: పదోతరగతి లేదా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.


II. మొత్తం ఖాళీలు: 6,329.


➥ ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ): 5,660 పోస్టులు


➥ హిందీ: 606 పోస్టులు


➥ ఇంగ్లిష్: 671 పోస్టులు


➥ మ్యాథ్స్‌: 686 పోస్టులు


➥ సోషల్‌ స్టడీస్‌: 670 పోస్టులు


➥ సైన్స్: 678 పోస్టులు


➥ బెంగాలీ: 10 పోస్టులు


➥ గుజరాతీ: 44 పోస్టులు


➥ కన్నడ: 24 పోస్టులు


➥ మలయాళం: 02 పోస్టులు


➥ మణిపురి: 06 పోస్టులు


➥ మరాఠీ: 52 పోస్టులు


➥ ఒడియా: 25 పోస్టులు


➥ తెలుగు: 102 పోస్టులు


➥ ఉర్దూ: 06 పోస్టులు


➥ మిజో: 02 పోస్టులు


➥ సంస్కృతం: 358 పోస్టులు


➥ సంతాలి: 21 పోస్టులు


➥ మ్యూజిక్‌: 320 పోస్టులు


➥ ఆర్ట్‌: 342 పోస్టులు


➥ పీఈటీ (మెన్): 321 పోస్టులు 


➥ పీఈటీ (ఉమెన్): 345 పోస్టులు


➥ లైబ్రేరియన్: 369 పోస్టులు


➥ హాస్టల్ వార్డెన్ (పురుషులు): 335 పోస్టులు


➥ హాస్టల్ వార్డెన్ (మహిళలు): 334 పోస్టులు


ప్రిన్సిపల్/ పీజీటీ/ జూనియర్‌ సెక్రెటేరియట్‌ అసిస్టెంట్/ ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టుల దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


టీజీటీ/ హాస్టల్ వార్డెన్ పోస్టుల దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..