NALCO Recruitment: భువనేశ్వర్‌లోని నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌(నాల్కో)లో గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 277 పోస్టులను భర్తీ చేయనున్నారు. గేట్-2023 మార్కుల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు నిర్వహిస్తారు. ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  సరైన అర్హతలున్నవారు మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు నాలుగు సంవత్సరాలు విధిగా పనిచేస్తున్నట్లు బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 277


* గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీ


రిజర్వేషన్లు: జనరల్-116, ఈడబ్ల్యూఎస్-27, ఓబీసీ-72, ఎస్టీ-18, ఎస్సీ- 44.


విభాగాల వారీగా ఖాళీలు..


➥ సివిల్‌-07 


➥ మెకానికల్‌-127


➥ ఎలక్టికల్‌- 100


➥ ఇన్‌స్ట్రుమెంటేషన్- 20


➥ మెటలర్జీ- 10


➥ కెమికల్-13


➥ కెమిస్ట్రీ- 07


అర్హత: 65 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ(ఇంజినీరింగ్/టెక్నాలజీ) ఉండాలి. ఇక కెమిస్ట్రీ విభాగంలో పోస్టులకు మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.


వయోపరిమితి: 2.04.2024 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


దరఖాస్తు ఫీజు: రూ.500. సంస్థ ఉద్యోగులకు రూ.100.


ఎంపిక విధానం: గేట్-2023 స్కోరు ఆధారంగా. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు విధిగా అప్రెంటిస్‌షిప్ యాక్ట్ ప్రకారం అగ్రిమెంట్ బాండ్ (రూ.3 లక్షలు/ రూ. 4 లక్షలు) కింద కనీసం 4 సంవత్సరాలు తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుంది. ఏడాది ట్రైనింగ్ పీరియడ్ అదనం.


జీతం: రూ.40,000


ముఖ్యమైన తేదీలు..


🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 4.03.2024.


🔰 ఫీజు చెల్లించడానికి చివరితేది: 2.04.2024 


🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితదీ: 2.04.2024 


Notification


Website  


ALSO READ:


స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 314 ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి
న్యూఢిల్లీలోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో ఆపరేటర్‌ కమ్‌ టెక్నిషియన్‌ ట్రైనీ(ఓసీటీటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 314 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన, సంబంధిత విభాగాలకు సంబంధించి ఏదో ఒక దానిలో ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 18వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్‌లో ట్రేడ్స్‌మెన్ ట్రైనీ పోస్టులు, వివరాలు ఇలా
IREL Trademan Trainee Recruitment: ముంబయిలోని ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్(ఐఆర్ఈఎల్) వివిధ విభాగాల్లో ట్రేడ్స్‌మెన్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 67 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 12వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...