నాబార్డ్ ఆధ్వర్యంలోని నేషనల్ బ్యాంక్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్(నాబ్‌కాన్స్‌) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 19 సీనియర్‌/ మిడిల్‌ లెవల్‌ కన్సల్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  


వివరాలు..


* సీనియర్‌/ మిడిల్‌ లెవల్‌ కన్సల్టెంట్‌ పోస్టులు.


మొత్తం ఖాళీలు: 19


1. అరుణాచల్ ప్రదేశ్: 01


2. బీహార్: 01


3. ఛత్తీస్‌గఢ్: 01


4. గుజరాత్: 01


5. హిమాచల్ ప్రదేశ్: 02


6. జమ్మూ & కాశ్మీర్: 01


7. జార్ఖండ్ 01


8. మధ్యప్రదేశ్ 01


9. మహారాష్ట్ర: 01


10. మణిపూర్: 01


11. మిజోరం: 01


12. నాగాలాండ్: 01


13. ఒడిశా: 01


14. రాజస్థాన్: 01


15. తమిళనాడు 01


16. తెలంగాణ 01


17. ఉత్తర ప్రదేశ్ 01


18. నాబార్డ్, HO 01


అర్హత: పోస్టును అనుసరించి కనీసం 55శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌/ పీజీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.


పని అనుభవం: కనీసం 1-2 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 21-55 సంవత్సరాలు ఉండాలి.


జీతభత్యాలు: 


✦ సీనియర్‌ లెవల్‌ కన్సల్టెంట్: నెలకు రూ.61000-రూ.70000 చెల్లిస్తారు.


✦ మిడిల్‌ లెవల్‌ కన్సల్టెంట్: నెలకు రూ.51000-రూ.60000 చెల్లిస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


దరఖాస్తు చివరి తేది: 30.04.2023. 


Notification 


Website 


Also Read:


తెలంగాణ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ గురుకులాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల భర్తీకి ఏప్రిల్ 6న వెబ్‌నోట్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ 22న విడుదల చేశారు. దీనిద్వారా 1276 పీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 343 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 147 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 786 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత విభాగాల్లో పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


గురుకుల డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే!
తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 868 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 174 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 287 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 407 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో లెక్చరర్ పోస్టులు 785, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 39, లైబ్రేరియన్ పోస్టులు 36 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


గురుకుల జూనియర్ కళాశాలల్లో జేఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 2008 జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 253 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 291 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 1070 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో జేఎల్ పోస్టులు 1924, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 34, లైబ్రేరియన్ పోస్టులు 50 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 132 ఆర్ట్ టీచర్ పోస్టులు, జీతమెంతో తెలుసా?
తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఆర్ట్ టీచర్, డ్రాయింగ్ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 22 వెలువడింది. దీనిద్వారా 132 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 16 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 6 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 72 పోస్టులు, మైనార్టీ గురుకులాల్లో  38 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...