NABARD Recruitment: ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ దేశ వ్యాప్తంగా నాబార్డ్ శాఖల్లో స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 31 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు మార్చి 10 వరకు దరఖాస్తులు సచర్పించవచ్చు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 31

విభాగాల వారీగా ఖాళీలు..

➥ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్: 01

అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి బీఈ/బీటెక్/ఎంఎస్సీ/ఎంటెక్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు.

➥ ప్రాజెక్ట్ మేనేజర్- అప్లికేషన్ మేనేజ్‌మెంట్: 01

అర్హత: బ్యాచిలర్/మాస్టర్స్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్/ఇంజనీరింగ్/మేనేజ్‌మెంట్ డిగ్రీ)  ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు.

➥ లీడ్ ఆడిటర్: 02

అర్హత: బ్యాచిలర్/ మాస్టర్స్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్/ఐటి లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు CISA/ CISSP అండ్ ISO 27001 లీడ్ ఆడిటర్ / లీడ్ ఇంప్లిమెంటర్‌లో సర్టిఫికేషన్, పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు. 27-40 సంవత్సరాలు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

➥ అడిషనల్‌ చీఫ్ రిస్క్ మేనేజర్: 01

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్/ పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఎకనామిక్స్/ స్టాటిస్టిక్స్/ ఫైనాన్స్/ బిజినెస్)/ మాస్టర్స్ (మేనేజ్‌మెంట్ ఎంబీఏ,/ పీజీడీఐ లేదా సీఏ/సీఎస్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు. 

➥ సీనియర్ అనలిస్ట్‌- సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్: 01

అర్హత: కంప్యూటర్ సైన్స్/ఐటీ/సైబర్ సెక్యూరిటీ రంగంలో గ్రాడ్యుయేట్ / పోస్ట్ గ్రాడ్యుయేట్‌తో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు. 

➥ రిస్క్ మేనేజర్ - క్రెడిట్ రిస్క్: 02

అర్హత: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ(ఫైనాన్స్ / కామర్స్ / ఎకనామిక్స్ / స్టాటిస్టిక్స్ / ఎకనామెట్రిక్స్ / మ్యాథమెటిక్స్ / మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ / ఎంబీఏ / పీజీడీబీఏ/ పీజీపీఎం/పీజీడీఎం)తో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు. 30-45 సంవత్సరాలు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

➥ రిస్క్ మేనేజర్- మార్కెట్ రిస్క్: 02

అర్హత: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ(ఫైనాన్స్ / కామర్స్ / ఎకనామిక్స్ / స్టాటిస్టిక్స్ / ఎకనామెట్రిక్స్ / మ్యాథమెటిక్స్ / మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ / ఎంబీఏ / పీజీడీబీఏ/ పీజీపీఎం/పీజీడీఎం)తో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు. 30-45 సంవత్సరాలు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

➥ రిస్క్ మేనేజర్- ఆపరేషనల్ రిస్క్: 02

అర్హత: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ(ఫైనాన్స్ / కామర్స్ / ఎకనామిక్స్ / స్టాటిస్టిక్స్ / ఎకనామెట్రిక్స్ / మ్యాథమెటిక్స్ / మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ / ఎంబీఏ / పీజీడీబీఏ/ పీజీపీఎం/పీజీడీఎం)తో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు. 30-45 సంవత్సరాలు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

➥ రిస్క్ మేనేజర్ - IS & సైబర్ సెక్యూరిటీ: 01

అర్హత: బ్యాచిలర్/మాస్టర్స్ డిగ్రీ (ఐటీ/కంప్యూటర్ సైన్స్/ ఎంసీఏ)తో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు. 30-45 సంవత్సరాలు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

➥ సైబర్ అండ్‌ నెట్‌వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్: 02

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్/ఐటి లేదా బి.ఇ./బి. టెక్ ఏదైనా విభాగం) లేదా ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అండ్ మాస్టర్స్ డిగ్రీ
(కంప్యూటర్ సైన్స్ / ఐటీ)తో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు. 27-40 సంవత్సరాలు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

➥ డేటాబేస్ అండ్‌ ఆపరేటింగ్ సిస్టమ్స్ స్పెషలిస్ట్: 02

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్/ఐటి లేదా బి.ఇ./బి. టెక్ ఏదైనా విభాగం) లేదా ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అండ్ మాస్టర్స్ డిగ్రీ
(కంప్యూటర్ సైన్స్ / ఐటీ)తో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు. 27-40 సంవత్సరాలు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

➥ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్‌ బ్యాంకింగ్ స్పెషలిస్ట్: 02

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్/ఐటి లేదా బి.ఇ./బి. టెక్ ఏదైనా విభాగం) లేదా ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అండ్ మాస్టర్స్ డిగ్రీ
(కంప్యూటర్ సైన్స్ / ఐటీ)తో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు. 27-40 సంవత్సరాలు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

➥ ఎకనామిస్ట్‌: 02

అర్హత: కనీసం 55% మార్కులతో / తత్సమాన గ్రేడ్‌లతో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్/ అప్లైడ్ ఎకనామిక్స్ / ఫైనాన్షియల్ ఎకనామిక్స్ / స్టాటిస్టిక్స్ / డేటా సైన్స్ / ఫైనాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ (పోస్ట్ గ్రాడ్యుయేట్- ఎంఏ/ఎంఎస్సీ)తో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 23-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ క్రెడిట్ ఆఫీసర్: 01

అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ (ఏదైనా విభాగం), ఫుల్ టైమ్ ఎంబీఏ (ఫైనాన్స్) / పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ ఎంఎంఎస్ (ఫైనాన్స్ / సీఏ/ సీఎఫ్‌ఏ/ఐసీడబ్ల్యూఏతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు.

➥ లీగల్ ఆఫీసర్: 01

అర్హత: భారతదేశంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు.

➥ ఈటీఎల్‌ డెవలపర్: 01

అర్హత: కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్ /ఎంఈ/ఎంటెక్(కంప్యూటర్ సైన్స్ /IT)తో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు. 25-40 సంవత్సరాలు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

➥ డేటా కన్సల్టెంట్: 02

అర్హత: కనీసం 60% మార్కులతో బీఈ/ ఎంఈ / బీటెక్ /ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్/ఐటీ/డేటా సైన్స్/మెషిన్ లెర్నింగ్ మరియు ఏఐ), ఎంబీఏ / పీజీడీఎంతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు. 25-40 సంవత్సరాలు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

➥ బిజినెస్‌ అనలిస్ట్‌: 01

అర్హత: బీసీఎస్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఫైనాన్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో), బిజినెస్ అనలిస్ట్ /పవర్ బిఐలో సర్టిఫికేషన్ కోర్సుతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు. 25-40 సంవత్సరాలు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

➥ పవర్ బీఐ రిపోర్ట్‌ డెవలపర్: 01

అర్హత: డేటా సైన్స్/BCA/MCAలో పోస్ట్ గ్రాడ్యుయేట్, పవర్ BI/ టేబుల్‌పై నాలెడ్జ్, పైథాన్/ ML, HTML, అడ్వాన్స్‌డ్ ఎక్సెల్, R, Postgre sqlలో ప్రావీణ్యంతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు. 25-40 సంవత్సరాలు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

➥ స్పెషలిస్ట్- డేటా మేనేజ్‌మెంట్: 01

అర్హత: సోషల్ వర్క్‌లో మాస్టర్స్/మేనేజ్‌మెంట్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.

➥ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ కన్సల్టెంట్- టెక్నికల్: 01

అర్హత: ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు/ సంస్థల నుంచి బీఈ/ బీటెక్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ బీసీఏ)తో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.

➥ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ కన్సల్టెంట్- బ్యాంకింగ్: 01

అర్హత: ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు/ సంస్థల నుంచి ఎంబీఏ (ఫైనాన్స్)తో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 55 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.50. మిగతా వారందరికీ రూ.800.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

వేతనం..

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:  10.03.2024.

Notification

Online Application

Website