Apprentice Recruitment 2024: మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్, డిప్లొమా (టెక్నీషియన్) & జనరల్ స్ట్రీమ్ (గ్రాడ్యుయేట్స్) ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 90 పోస్టులను భర్తీచేయనున్నారు. డిప్లొమా/సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉన్నవారు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 90
➥ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్: 20
పోస్టుల కెటాయింపు: యూఆర్: 10, ఎస్సీ: 03, ఎస్టీ: 01, ఓబీసీ: 06.
విభాగం: కెమికల్ అండ్ ఎలక్ట్రికల్.
అర్హత: డిగ్రీ(ఇంజినీరింగ్/టెక్నాలజీ) లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి జనరల్ స్ట్రీమ్స్‌లో డిగ్రీ కలిగి ఉండాలి.
➥ డిప్లొమా (టెక్నీషియన్): 20
పోస్టుల కెటాయింపు: యూఆర్: 10, ఎస్సీ: 03, ఎస్టీ: 02, ఓబీసీ: 05.
విభాగం: కెమికల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్.
అర్హత: డిప్లొమా(ఇంజినీరింగ్/టెక్నాలజీ) కలిగి ఉండాలి.
➥ జనరల్ స్ట్రీమ్ (గ్రాడ్యుయేట్లు): 50
పోస్టుల కెటాయింపు: యూఆర్: 26, ఎస్సీ: 07, ఎస్టీ: 03, ఓబీసీ: 14.
అర్హత: బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్, బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్, బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యునికేషన్, బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్, బ్యాచిలర్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజమ్ మేనేజ్‌మెంట్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ పర్ఫామింగ్ ఆర్ట్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: నిబంధనల ప్రకారం.
దరఖాస్తు విధానం: న్యూస్ పేపర్‌లో ప్రచురితమైన తేది నుంచి 21రోజుల్లోగా దరఖాస్తులు సమర్పించాలి.
ఎంపిక విధానం: మెరిట్‌లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
వేతనం: ఇంజినీరీంగ్/ జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: రూ.9000. డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్: రూ.8000.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The General Manager,
High Explosives Factory, Khadki,
Maharashtra, Pune- 411003.
ALSO READ:
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 69 స్పెషలిస్ట్, సైంటిస్ట్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు/శాఖల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 69 స్పెషలిస్ట్, సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులు ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు ప్రింట్ తీసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
యూనియన్ బ్యాంకులో 606 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇవే
Union Bank of India SO Recruitment: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (Specialist Officers) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 606 ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 3 నుంచి 23 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..