మంగళూరులోని మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ నాన్ మేనేజ్‌మెంట్ కేడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఫిజికల్‌ టెస్ట్‌ ద్వారా ఖాళీలను భర్తీచేస్తారు.  

వివరాలు..

* నాన్ మేనేజ్‌మెంట్ కేడర్ పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 50

విభాగాల వారీగా ఖాళీలు..

➥ కెమికల్‌: 19

➥ ఎలక్ట్రికల్‌: 05

➥ మెకానికల్‌: 19

➥ కెమిస్ట్రీ: 01

➥ డ్రాఫ్ట్స్‌మ్యాన్‌: 01

➥ సెక్రటరీ: 05

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 2 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 28 సంవత్సరాలు  మించకూడదు.

దరఖాస్తు ఫీజు: అన్‌ రిజర్వ్‌డ్‌ అభ్యర్థులు రూ.118 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఫిజికల్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక ఉంటుంది.

జీతభత్యాలు: నెలకు రూ.25000- రూ.86400 చెల్లిస్తారు.

చిరునామా: General Manager(HR),                      Recruitment Section,                      Mangalore Refinery and Petrochemicals Limited,                      Kuthethoor Post, Mangalore- 575030, Karnataka.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: 16.06.2023.

Notification

Website

Also Read:

ఐడీబీఐ బ్యాంకులో 1036 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1036 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి మే 24 నుంచి జూన్ 7 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఐడీబీఐ బ్యాంకులో 136 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 136 ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అర్హతలు, అనుభవం, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జూన్ 1 నుంచి జూన్ 7 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మేనేజర్ పోస్టులకు రూ.48,170 - రూ.69810; అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు రూ.63,840- రూ.78,230; డిప్యూటీ జనరల్ మేనేజర్పోస్టులకు రూ.76,010- రూ.89,890గా ఉంటుంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..