గోవాలోని మార్ముగావ్ పోర్ట్ అథారిటీ 2022-23 సంవత్సరానికి గాను పలు అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు పోస్టుని అనుసరించి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విధానంలో జనవరి 20 వరకు దరఖాస్తుచేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 51


➥ గ్రాడ్యుయేట్&టెక్నీషియన్ అప్రెంటిస్ 


➥ ట్రేడ్ & వొకేషనల్ అప్రెంటిస్‌లు


విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ డీజిల్, కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అడ్వాన్స్ వెల్డర్, ఫిట్టర్, అకౌంటెన్సీ & ఆడిటింగ్, కంప్యూటర్ టెక్నిక్, ఆఫీస్ మేనేజ్‌మెంట్.


1) గ్రాడ్యుయేట్&టెక్నీషియన్ అప్రెంటిస్‌: 15 పోస్టులు 


అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్(డిగ్రీ/డిప్లొమా) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


వయోపరిమితి: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.


శిక్షణ వ్యవధి: 1 సంవత్సరం.


స్టైపెండ్: నెలకు రూ.8000-రూ.9000 చెల్లిస్తారు.


2) ట్రేడ్ & వొకేషనల్ అప్రెంటిస్‌లు: 36 పోస్టులు


అర్హత: 10వ తరగతి, 10+2, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


వయోపరిమితి: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.


శిక్షణ వ్యవధి: 1 సంవత్సరం.


స్టైపెండ్: నెలకు రూ.7000 చెల్లిస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


దరఖాస్తు చివరితేది: 20.01.2023. 


Notification


Website 


Also Read:


సికింద్రాబాద్- దక్షిణ మధ్య రైల్వేలో 4103 అప్రెంటిస్ ఖాళీలు!
సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే ఎస్‌సీఆర్ వర్క్‌షాప్/యూనిట్‌లలో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. యాక్ట్ అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఎస్‌సీఆర్ పరిధిలోకి వచ్చే జిల్లాల్లో నివసించే అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుచేసుకోవాలి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జనవరి 29 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


నేషనల్ హైడ్రో-ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్‌లో 401 ఖాళీలు-అర్హతలివే!
నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 401 ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గేట్, యూజీసీనెట్, క్లాట్ (పీజీ), సీఎం/సీఎంఏ స్కోరు ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా జనవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలివే!
తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్‌ఎన్ పీడీసీఎల్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సంస్థలో ఛార్టర్డ్ అకౌంటెంట్ విభాగంలో 157 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నీ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను హన్మకొండలోని ఎన్‌పీడీసీఎల్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...