MOIL Recruitment: నాగ్‌పూర్‌లోని మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ (MOIL) ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 75 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.295 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 


వివరాలు..


 ఖాళీల సంఖ్య: 75


పోస్టుల వారీగా ఖాళీలు..


⏩ మైన్‌ ఫోర్‌మెన్‌-1: 12 పోస్టులు


పోస్టుల కెటాయింపు: యూఆర్- 05, ఈడబ్ల్యూఎస్- 01, ఎస్సీ- 02, ఎస్టీ- 01, ఓబీసీ- 03.


అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత, మైనింగ్ & మైన్ సర్వేయింగ్‌లో డిప్లొమా అండ్ చెల్లుబాటు అయ్యే మైన్ ఫోర్‌మ్యాన్ సర్టిఫికేట్ / సెకండ్ క్లాస్ మేనేజర్స్ / ఫస్ట్ క్లాస్ మేనేజర్స్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ (అపరిమితం) కలిగి ఉండాలి.


అనుభవం: మైన్ ఫోర్‌మ్యాన్ సర్టిఫికేట్ / సెకండ్ క్లాస్ మేనేజర్స్/ఫస్ట్ క్లాస్ మేనేజర్స్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ (అపరిమితం) పొందిన తర్వాత 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.


జీతం: నెలకు రూ.26,900 - రూ.48,770.


⏩ సెలెక్ట్ గ్రేడ్ మైన్‌ ఫోర్‌మెన్‌: 05 పోస్టులు 


పోస్టుల కెటాయింపు: యూఆర్- 03, ఓబీసీ- 02.


అర్హతలు/అనుభవం: 


➥ బీఈ/బీటెక్‌ (మైనింగ్ లేదా తత్సమానం) అండ్ చెల్లుబాటు అయ్యే మైన్ ఫోర్‌మ్యాన్ సర్టిఫికేట్/సెకండ్ క్లాస్/ఫస్ట్ క్లాస్ మేనేజర్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ (అపరిమితం) కలిగి ఉండాలి. మైన్ ఫోర్‌మ్యాన్ సర్టిఫికేట్ / సెకండ్ క్లాస్ మేనేజర్స్/ఫస్ట్ క్లాస్ మేనేజర్స్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ (అపరిమితం) పొందిన తర్వాత 1 సంవత్సరం అనుభవం ఉండాలి. లేదా 


➥ మైనింగ్ & మైన్ సర్వేయింగ్‌లో డిప్లొమా అండ్ చెల్లుబాటు అయ్యే మైన్ ఫోర్‌మ్యాన్ సర్టిఫికేట్ / సెకండ్ క్లాస్ మేనేజర్స్ / ఫస్ట్ క్లాస్ మేనేజర్స్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ (అపరిమితం) కలిగి ఉండాలి. మైన్ ఫోర్‌మ్యాన్ సర్టిఫికేట్ / సెకండ్ క్లాస్ మేనేజర్స్/ఫస్ట్ క్లాస్ మేనేజర్స్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ (అపరిమితం) పొందిన తర్వాత 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. లేదా 


➥ పదోతరగతి ఉత్తీర్ణత, చెల్లుబాటు అయ్యే మైన్ ఫోర్‌మ్యాన్ సర్టిఫికేట్/సెకండ్ క్లాస్/ఫస్ట్ క్లాస్ మేనేజర్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ (అపరిమితం) కలిగి ఉండాలి. మైన్ ఫోర్‌మ్యాన్ సర్టిఫికేట్ / సెకండ్ క్లాస్ మేనేజర్స్/ఫస్ట్ క్లాస్ మేనేజర్స్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ (అపరిమితం) పొందిన తర్వాత 6 సంవత్సరాల అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.


జీతం: నెలకు రూ.27,600 - రూ.50,040.


⏩ మైన్‌ మేట్‌ గ్రేడ్‌-1: 20 పోస్టులు 


పోస్టుల కెటాయింపు: యూఆర్- 08, ఈడబ్ల్యూఎస్- 02, ఎస్సీ- 03, ఎస్టీ- 02, ఓబీసీ- 05.


అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత, చెల్లుబాటు అయ్యే మైన్ మేట్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ (అపరిమితం) కలిగి ఉండాలి. 


అనుభవం: ప్రఖ్యాత మైనింగ్ కంపెనీలో 3 సంవత్సరాలు మైన్ మేట్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.


జీతం: నెలకు రూ.24,800 - రూ.44,960.


⏩  బ్లాస్టర్ గ్రేడ్‌-2: 14 పోస్టులు  


పోస్టుల కెటాయింపు: యూఆర్- 05, ఈడబ్ల్యూఎస్- 02, ఎస్సీ- 02, ఎస్టీ- 01, ఓబీసీ- 04.


అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత, బ్లాస్టర్స్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ (అపరిమితం) కలిగి ఉండాలి. 


అనుభవం: మైనింగ్ సంస్థలో బ్లాస్టర్‌గా 1 సంవత్సరం అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.


జీతం: నెలకు రూ.24,100 - 43,690.


⏩ వైండింగ్‌ ఇంజిన్‌ డ్రైవర్‌-2: 24 పోస్టులు


పోస్టుల కెటాయింపు: యూఆర్- 10, ఈడబ్ల్యూఎస్- 02, ఎస్సీ- 04, ఎస్టీ- 01, ఓబీసీ- 07.


అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత, ఫస్ట్ క్లాస్ వైండింగ్ ఇంజిన్ డ్రైవర్స్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ కలిగి ఉండాలి. 


అనుభవం: సెకండ్ క్లాస్ వైండింగ్ ఇంజిన్ డ్రైవర్స్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ పొందిన తర్వాత వైండింగ్ ఇంజిన్ డ్రైవర్‌గా 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. 


వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.


జీతం: నెలకు రూ.24,800 - రూ.44,960.


దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.295, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్ ఆధారంగా.


ముఖ్యమైన తేదీలు..


✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మర్చి 04.03.2025.


✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.03.2025.


✦ దరఖాస్తు సవరణకు చివరి తేదీ: 25.03.2025.


✦ దరఖాస్తును ప్రింట్ తీసుకోవడానికి  చివరి తేదీ: 09.04.2025.


✦ ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు తేదీలు: 04.03.2025. నుంచి 25.03.2025.


Notification 
Online Application
Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..