Viral News: ఏఐ రీసెర్చ్ ఇంజనీర్ అయితే చాలు బేస్ శాలరీ కనీసం నాలుగు కోట్లు - డిమాండే డిమాండ్ !

Meta research engineer: ఏఐలో తమదైన ముద్ర వేసేందుకు మెటా చేస్తున్న ప్రయత్నాలు చాలా కాస్ట్ లీగా ఉంటాయి. ఏడాదికి ఒక్కో ఇంజనీర్ కు నాలుగు కోట్లకుపైగా చెల్లిస్తున్నారు.

Continues below advertisement

Rs 4 crore base salary : ఫేస్ బుక్, వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా ఇప్పటికీ ఏఐ  రంగంలో తనదైన ముద్ర వేయలేకపోయింది. ఆ లోటును తీర్చుకునేందుకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు మార్క్ జుకర్ బెర్గ్. బెస్ట్ టాలెంట్ అనుకున్న వారందర్నీ నియమించుకుటున్నారు. మెటా కంపెనీలోని అత్యుత్తమ AI పరిశోధక ఇంజనీర్‌కు సంవత్సరానికి ఏకంగా 440,000 డాలర్లు చెల్లిస్తున్నారు. ఇది నాలుగు కోట్ల రూపాయలతో సమానం.   ఈ జీతం కేవలం బేస్ జీతం మాత్రమే. వీటికి అదనంగా నస్‌లు, రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్ (RSUs), లేదా ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయి.  

Continues below advertisement

యునైటెడ్ స్టేట్స్‌లో H-1B వీసా ప్రోగ్రామ్  కోసం మెటా సమర్పించిన  ఫెడరల్ ఫైలింగ్స్ లో వెల్లడయింది.   విదేశీ నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించే కంపెనీలు ఈ ఫైలింగ్స్‌లో జీతాల వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది.   H-1B వీసా ప్రోగ్రామ్ ద్వారా యు.ఎస్. కంపెనీలు సంవత్సరానికి 85,000 మంది నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించవచ్చు,   

AI పరిశోధకులతో పాటు మెటా ఇతర రోల్స్‌కు కూడా ఆకర్షణీయమైన జీతాలను అందిస్తోంది. టాప్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు  ఐదు లక్షల డాలర్ల వరకూ జీతాలు ఉన్నాయి.  మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు, డేటా సైన్స్ మేనేజర్లు ,  డైరెక్టర్లు ప్రొడక్ట్ మేనేజర్లు, డిజైనర్లు, మరియు UX పరిశోధకులు బేస్ జీతాలు సాధారణంగా రెండు కోట్ల నుచంి ప్రారంభమవుతున్నాయి. 

బేస్ జీతంతో పాటు  రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్ (RSUs),  *పనితీరు బోనస్‌లు మెటా ఉద్యోగులకు మొత్తం జీతాన్ని గణనీయంగా పెంచుతాయి. కొన్ని సందర్భాల్లో, ఈ అదనపు ప్రోత్సాహకాలు మొత్తం జీతాన్ని రెట్టింపు లేదా మూడు రెట్లు చేయవచ్చునని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.  మెటాలో ఒక సీనియర్ ఇంజనీర్ సంవత్సరానికి సుమారు ఏడున్నర కోట్ల రూపాయలు సంపాదిసత్‌ున్నారు.   E7 స్థాయి ఇంజనీర్లు సగటున 13 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. 

 భారీ జీతాలు సిలికాన్ వ్యాలీలో  AI టాలెంట్ వార్ జరుగుతోందని సూచిస్తున్నాయి.  మెటా, ఓపెన్‌AI, గూగుల్,  ఆంత్రోపిక్ వంటి కంపెనీలు ఉత్తమ AI పరిశోధకులను ఆకర్షించడానికి తీవ్రంగా పోటీపడుతున్నాయి.  ఓపెన్‌AI మాజీ CTO మీరా మురాటి స్థాపించిన స్టార్టప్  టెక్నికల్ స్టాఫ్‌కు  నాలుగున్నర కోట్ల రూపాయల బేస్ జీతం అందిస్తోంది., అయినప్పటికీ అది ఇంకా ఉత్పత్తిని లాంచ్ చేయలేదు.  ఓపెన్‌AI నుంచి మెటా ఏడుగురు పరిశోధకులను  ఆకర్షించింది. వీరికి రెండున్నర వేల కోట్లు చెల్లిచిందన్న ప్రచారం ఉంది. 
  AI అభివృద్ధిలో ముందుండటానికి మెటా భారీగా పెట్టుబడి పెడుతోంది.  CEO మార్క్ జుకర్‌బర్గ్ వ్యక్తిగతంగా రిక్రూట్‌మెంట్‌లో పాల్గొంటూ, టాప్ పరిశోధకులకు నేరుగా మెసేజ్‌లు పంపుతూ, అత్యాధునిక GPUలు (గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్) వంటి వనరులకు యాక్సెస్ అందిస్తున్నారు. - ఓపెన్‌AI నుంచి ఏడుగురు పరిశోధకులను మెటా ఆకర్షించడంతో విమర్శలు కూడా వస్తున్నాయి. 

మిలియన్ డాలర్ల ప్యాకేజీలు అందిస్తున్నప్పటికీ, మెటా కొంతమంది AI స్టాఫ్‌ను నిలుపుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది, వారు ఓపెన్‌AI మరియు ఆంత్రోపిక్ వంటి కంపెనీలకు వెళుతున్నారు.  

Continues below advertisement
Sponsored Links by Taboola