మెకాన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. పోస్టుని అనుసరించి వయసు 35 నుంచి 54 సంవత్సరాల మధ్య ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించి నిర్ణిత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


వివరాలు..


* మొత్తం ఖాళీలు: 161


పోస్టులు: డిప్యూటీ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, సీనియర్ కన్సల్టెంట్, ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ తదితరాలు.


అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ ఉత్తీర్ణత.


పని అనుభవం: కనీసం 2-24 ఏళ్లు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 30-54 ఏళ్లు ఉండాలి.


జీతభత్యాలు: నెలకు రూ.35200-రూ.83500 చెల్లిస్తారు.


కాంట్రాక్ట్ వ్యవధి: 2-3 ఏళ్లు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు పీజు: రూ.500.


ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


దరఖాస్తు చివరి తేది: 25.12.2022. 


Notification 


Website 


Also Read:


పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్  విడుదల చేసింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో పోస్టుల వివరాలు అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. 19 సబ్జెక్టుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబర్ 14 నుంచి జనవరి 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో బ్యాచీలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ) అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


నిరుద్యోగులకు గుడ్ న్యూస్, టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ - వివరాలు ఇలా!
తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో తీపి కబురు వినిపించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 18 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబర్ 8న నోటిఫికేషన్ (నెం.21/2022) విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి డిసెంబర్ 16 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. జనవరి 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


కేంద్రీయ విద్యాలయాల్లో కొలువుల మేళా, 13404 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు! 
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 13,404 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబరు 26 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...