Mecon India Ltd Recruitment Notification: రాంచీలోని మెకాన్‌ ఇండియా లిమిటెడ్  ఒప్పంద ప్రాతిపదికన పలు విభాగాల్లో ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో జులై 31లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హతలు, పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, సంస్థ ఉద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.


వివరాలు..


⫸ ప్రొఫెషనల్‌ పోస్టులు


ఖాళీల సంఖ్య: 309.


➥ డిప్యూటీ ఇంజినీర్: 87 పోస్టులు


➥ ఇంజినీర్: 01 పోస్టు


➥ అసిస్టెంట్ ఇంజినీర్: 88 పోస్టులు


➥ జూనియర్ ఇంజినీర్: 15 పోస్టులు


➥ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్: 08 పోస్టులు


➥ జూనియర్ ఎగ్జిక్యూటివ్: 04 పోస్టులు


➥ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్: 10 పోస్టులు


➥ ఎగ్జిక్యూటివ్: 01 పోస్టు


విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, డిజైన్, స్ట్రక్చరల్, సేఫ్టీ, ఐటీ, హెచ్‌ఆర్‌, పర్చేజ్ అండ్‌ స్టోర్, ఎస్టేట్, ప్రాజెక్ట్‌, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, రిఫ్రాక్టరీస్, మార్కెట్ రిసెర్చ్, ఎంఏఎస్, బైప్రొడక్ట్ అండ్ కెమికల్స్, కాంట్రాక్ట్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఫైనాన్స్, కమర్షియల్, ప్రాసెసింగ్, మెటలర్జీ, ఆర్కిటెక్చర్, జియోలజీ, మైనింగ్, అడ్మినిస్ట్రేషన్, ఎస్‌ఏపీ.


అర్హత: సంబంధిత విభాగంలో సీఎంఏ/ సీఏ/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 


వయోపరిమితి: 15-06-2024 నాటికి 50 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు సంబంధించి జనరల్-10 సంవత్సరాలు, బీసీ-13 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 15 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది. ఇక జమ్ముకశ్మీర్ ప్రాంతాలకు చెందినవారికి 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు కేంద్రప్రభుత్వ నిబంధనల మేరక వయోసడలింపు వర్తిస్తుంది. 


దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, సంస్థ ఉద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: విద్యార్హతలు, పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.


ముఖ్యమైన తేదీలు...


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.07.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.07.2024.


Notification


Online Application


Website


ALSO READ:


ఇండియన్ నేవీలో బీటెక్ కోర్సు, ఆపై ఉన్నత హోదా ఉద్యోగం
భారత నావికాదళంలో నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి (జనవరి 2025 బ్యాచ్) నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచుల్లో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద  మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు జేఈఈ (మెయిన్)-2024 పరీక్షలో ర్యాంకు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు జులై 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైనవారికి కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ ఉంటుంది. అభ్యర్థులకు సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..




మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..