LIC Housing Finance Ltd Junior Assistant Notification: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(LIC)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో 200  జూనియర్‌ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు 43 పోస్టులను కేటాయించారు. ఇందులో ఏపీకి 12 పోస్టులు, తెలంగాణకు 31 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్ తప్పనిసరి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న వారికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. కంప్యూటర్‌ ఆపరేషన్స్‌/ లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్‌/ డిప్లొమా/ డిగ్రీ అర్హత ఉండాలి. ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 


వివరాలు..


* జూనియర్‌ అసిస్టెంట్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 200. 


➥ ఆంధప్రదేశ్‌: 12 పోస్టులు


➥ తెలంగాణ: 31 పోస్టులు


➥ అస్సామ్: 05 పోస్టులు


➥ఛత్తీస్‌గఢ్: 06 పోస్టులు


➥ గుజరాత్: 05 పోస్టులు


➥ హిమాచల్ ప్రదేశ్: 03 పోస్టులు


➥ జమ్మూకశ్మీర్: 01 పోస్టు


కర్ణాటక: 38 పోస్టులు


➥ మధ్యప్రదేశ్: 12 పోస్టులు


➥ మహారాష్ట్ర: 53 పోస్టులు


➥ పుదుచ్చేరి: 01 పోస్టు


➥ సిక్కిం: 01 పోస్టు


➥ తమిళనాడు: 10 పోస్టులు


➥ ఉత్తర్ ప్రదేశ్: 17 పోస్టులు


➥ వెస్ట్ బెంగాల్: 05 పోస్టులు


అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా రెగ్యులర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అయితే కరస్పాండెన్స్‌/డిస్టెన్స్‌/పార్ట్‌ టైమ్‌ విధానంలో డిగ్రీ చదివినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుగా నిర్ణయించారు. అభ్యర్థులకు కంప్యూటర్‌ నాలెడ్జ్ తప్పనిసరి. స్కూలు లేదా కాలేజీ లేదా విద్యాసంస్థలో కంప్యూటర్‌/ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఒక సబ్జెక్టుగా చదవి ఉండాలి. (లేదా) కంప్యూటర్‌ ఆపరేషన్స్‌/లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్‌ కోర్సు/ డిప్లొమా/ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.


వయోపరిమితి: అభ్యర్థుల వయసు 01.07.2024 నాటికి 21 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. అభ్యర్థులు 02.07.1996 – 01.07.2003 మధ్య జన్మించినవారై ఉండాలి. 


దరఖాస్తు ఫీజు: రూ.800.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. 


పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, లాజికల్ రీజనింగ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 40 ప్రశ్నలు-40 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు-40 మార్కులు, కంప్యూటర్ స్కిల్ 40 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు. ఇంగ్లిష్ మాధ్యమంలోనే ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో నెగటివ్ మార్కుల విధానం అమలుచేస్తారు. ప్రతి ప్రశ్నలకు ఒకమార్కు కాగా.. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు. అంటే ప్రతి నాలుగు తప్పులకు ఒకమార్కు కోత విధిస్తారు. సమాధానం ఇవ్వని ప్రశ్నలకు ఎలాంటి మార్కులు ఉండవు.


జీతం: రూ.30,000 - రూ.32,800.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 25.07.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 14.08.2024.


➥ ఆన్‌లైన్ పరీక్ష హాల్‌టికెట్లు డౌన్‌లోడ్: పరీక్షకు వారం లేదా రెండువారాల ముందు నుంచి.


➥ ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 2024, సెప్టెంబరులో. 


NOTIFICATION


ONLINE APPLICATION


WEBSITE




మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...