కేంద్రీయ విద్యాలయాల్లో లైబ్రేరియన్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎస్‌ఎస్‌ఏ), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎస్‌వో), స్టెనో-2, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జేఎస్ఏ), ప్రైమరీ టీచర్(రీఎగ్జామ్) ఉద్యోగాల భర్తీకి మార్చి 1 నుంచి 11 వరకు నిర్వహించిన పరీక్షల ఆన్సర్ 'కీ'ని కేంద్రీయ విద్యాలయ సంగతన్ మార్చి 17న విడుదల చేసింది. ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ రూల్ నెంబర్, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు. 


ఆన్సర్ కీ పై అభ్యంతరాలకు అవకాశం..
ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలపడానికి అవకాశం కల్పించారు. మార్చి 20 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అభ్యర్థులు తమ అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది. మరే ఇతర విధానాల్లోనూ సమర్పించే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోరు. అభ్యర్థులు నమోదుచేసే అభ్యంతరాలను విషయ నిపుణుల పరిశీలిస్తారు. అభ్యంతరం సరైనదని తేలితే అభ్యర్థులు చెల్లించిన ఫీజును తిరిగి చెల్లిస్తారు. ఆ తర్వాత తుది కీని విడుదల చేస్తారు.


ఆన్సర్ కీ ఇలా చెక్ చేసుకోండి..


Step 1: ఆన్సర్ కీ కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. - https://kvsangathan.nic.in/


Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే ''Link to view/challenge answer keys for JSA/SSA/ASO/Steno/Librarian/PRT(reexam)" లింక్ మీద క్లిక్ చేయాలి.


Step 3: ఆన్సర్ కీతో కూడిన పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. 


Step 4: ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. 


Step 5: ఆన్సర్ కీ చెక్ చేసుకోవాలి. ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలి. 


Direct Link


నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 13,404 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 5 నుంచి జనవరి 2 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 6 వరకు పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీని తాజాగా విడుదల చేసింది.


Also Read:


సీఆర్‌పీఎఫ్‌లో 9212 కానిస్టేబుల్‌ పోస్టులు, టెన్త్ అర్హతతో నెలకు రూ.69,100 వరకు జీతం!
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ విభాగాల్లో మొత్తం 9212 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 424, తెలంగాణలో 301 ఖాళీలు ఉన్నాయి. పదోతరగతి, ఐటీఐ అర్హత ఉన్న పురుష/ మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 27న ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


బీఎస్‌ఎఫ్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్ పోస్టులు - అర్హతలు ఇవే!
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సబ్ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్ గ్రూప్- బి(నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు మార్చి 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


గెయిల్‌ గ్యాస్‌ లిమిలెడ్‌లో 120 అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!
నోయిడాకు చెందిన భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన గెయిల్ ఆధ్వర్యంలోని గెయిల్ గ్యాస్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 126 సీనియర్ అసోసియేట్, జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏదైనా డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...