కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పరీక్షల షెడ్యూలు విడుదలైంది. యూనివర్సిటీ అందిస్తున్న పలు పీజీ, వృత్తి విద్యా కోర్సుల్లో పీహెచ్‌డీ పరీక్షలు నవంబరు 25 నుంచి  ప్రారంభంకానున్నాయి. నవంబరు 25, 26, 27 తేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి 12.30 వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్‌టిక్కెట్లను నవంబరు 20 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 


పరీక్షల షెడ్యూలు ఇలా..


* నవంబరు 25న 
ఉదయం: కెమిస్ట్రీ, కామర్స్ & బిజినెస్ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్.
మధ్యాహ్నం: కంప్యూటర్ సైన్స్, జియోలజీ, ఇంగ్లిష్, హిస్టరీ, సోషల్ వర్క్, సోషియాలజీ, లా.

* నవంబరు 26న 
ఉదయం: మైక్రోబయాలజీ, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, టూరిజం మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, మ్యాథమెటిక్స్.
మధ్యాహ్నం: జువాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజికల్ ఎడ్యుకేషన్.

* నవంబరు 26న 
మధ్యాహ్నం: తెలుగు, ఫార్మసీ, ఎకనామిక్స్.



సబ్జెక్టుల వారీగా ఖాళీలు..
ఇంగ్లిష్‌-7, తెలుగు 11, కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌-18, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ 3, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ 11, సివిల్‌ ఇంజనీరింగ్‌ 6, ఎలక్ర్టానిక్స్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ 12, ఎలక్ర్టానిక్‌ ఇస్ట్రూమెంటేషన్‌ ఇంజనీరింగ్‌ -4, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ 14, లా 4, పార్మసీ 27, బయోటెక్నాలజీ 3, కెమిస్ట్రీ 7, కంప్యూటర్‌ సైన్స్‌ (ఎంసీఏ)6, జియాలజీ 2, మ్యాథ్స్‌-12, మైక్రోబయోలజీ-7, ఫిజిక్స్‌ 6, జువాలజీ -18, స్టాట్స్‌ 1, ఎకానమిక్స్‌-2, హిస్టరీ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌-8, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, హ్యుమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మె ట్‌-, పొలికల్‌సైన్స్‌- 10, సోషల్‌వర్క్స్‌, సోషియాలజీ - 4 ఖాళీలున్నాయి.


పరీక్ష విధానం..
* మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు వారి సబ్జెక్టులలో 100 మార్కులకు 90నిమిషాల్లో మల్టీపుల్‌ చాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్షల్లో వచ్చిన మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40 శాతంగా, బీసీలకు 35 శాతంగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి అర్హత మార్కులు లేవు.


కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం మే 19న నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. సంబంధిత విభాగాల్లో పీజీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి మే 20 నుంచి జూన్‌ 10వ వరకు దరఖాస్తులు స్వీకరించారు. తదుపరి రూ.500 అపరాధ రుసుంతో జూన్‌ 17 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థుల నుంచి రూ.1000, జనరల్‌ అభ్యర్థుల నుంచి రూ.1500 ఫీజు వసూలుచేశారు. జాతీయ స్థాయిలో జూనియర్‌ రిసెర్చ్ ఫెలోషిప్‌కు అర్హత సాధించిన వారు, యూజీసీ, సిఎస్‌ఐఆర్‌, ఐసిఎంఆర్‌, డిబిటి, ఇన్స్పైర్‌ ఫెలోషిప్‌ల ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తీర్ణులైన వారికి ఎంట్రన్స్‌ నుంచి మినహాయింపు లభిస్తుంది. పిహెచ్‌డి అడ్మిషన్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్‌ పరీక్ష ద్వారా జరుపుతారు. ఎంట్రెన్స్‌ పరీక్ష ఇంగ్లీష్‌ భాషలోనే నిర్వహిస్తారు.




Website 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..