కోనసీమలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన వివిధ సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 993 టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో సెప్టెంబరు 8 లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.


వివరాలు..


* ఖాళీల సంఖ్య: 993.


1) టెక్నికల్ అసిస్టెంట్: 331 పోస్టులు


అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ)/ బీఎస్సీ(బీజడ్‌సీ)/ బీఎస్సీ (లైఫ్ సైన్సెస్)/ డిప్లొమా (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై


ఉండాలి. 


2) డేటా ఎంట్రీ ఆపరేటర్: 331 పోస్టులు


అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి. 


3) హెల్పర్: 331 పోస్టులు


అర్హత: 8, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 


వయోపరిమితి: టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు 21-40 సంవత్సరాలు; హెల్పర్‌ పోస్టులకు 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.


దరఖాస్తుకు చివరితేదీ: 08.09.2023.


NOTIFICATION


APPLICATION FORM FOR TA 


APPLICATION FORM FOR DEO


APPLICATION FORM HELPER


WEBSITE


ALSO READ:


కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 29 ఖాళీలు, యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 29 ఖాళీలను భర్తీ చేయనుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ECIL: ఈసీఐఎల్‌లో 163 ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు- ఈ అర్హతలుండాలి
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్‌), కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా నెలకొన్న ఈసీఐఎల్‌ కేంద్రాల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనున్నారు.  సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


Navy: ఇండియన్ నేవీలో 362 ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టులు, ప్రారంభ వేతనం రూ.30 వేలు
ఇండియన్ నేవీలో ట్రేడ్స్‌మ్యాన్ మేట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పదోతరగతితోపాటు ఐటీఐ విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ పరీక్షలో ప్రతిభతో నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు అండమాన్‌ అండ్‌ నికోబార్‌ కమాండ్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. దరఖాస్తుల సంఖ్య అధికంగా వస్తే.. పదోతరగతి మార్కుల మెరిట్‌ ఆధారంగా ఒక్కో పోస్టుకు 25 మంది చొప్పున పరీక్ష రాయడానికి అవకాశం కల్పిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..