కర్ణాటక రాష్ట్రం కిత్తూరులోని కిత్తూరు రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ 2024-25 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు 'ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్' నోటిఫికేషన్ విడుదల చేసింది. 5వ తరగతి ఉత్తీర్ణులైన, చదువుతున్న బాలికలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు డిసెంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
* సైనిక్ స్కూల్ ప్రవేశాలు
అర్హతలు: 5వ తరగతి ఉత్తీర్ణలై ఉండాలి. జూన్ 1, 2012 నుంచి మే 31, 2014 మధ్యలో (రెండు తేదీలను కలిపి) జన్మించి ఉండాలి.
పరీక్ష ఫీజు: సాధారణ అభ్యర్థులకు రూ.2000, ఎస్సీ ఎస్టీలకు(కర్ణాటకలో నివసిస్తున్న వారికి మాత్రమే) రూ.1600 .
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష విధానం: పెన్ పేపర్ టెస్ట్. మీడియం: కన్నడ లేదా ఇంగ్లీష్ భాషల్లో నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రాలు: కిత్తూరు, విజయపూర్, బెంగళూరు & కలబుర్గి (కర్ణాటక).
రిజర్వేషన్: కిత్తూరు హోబ్లీకి 02 సీట్లు, డిఫెన్స్ పర్సనల్ డిపెండెంట్ కోసం 02 సీట్లు, జాతీయ శౌర్య అవార్డు విజేతల కోటా కోసం 03 సీట్లు కెటాయించారు.
స్కాలర్‌షిప్: కర్ణాటక ప్రభుత్వ స్కాలర్‌షిప్ పథకం ప్రకారం మెరిట్ స్కాలర్‌షిప్ కర్ణాటక నివాసానికి చెందిన అర్హులైన బాలికలకు మాత్రమే అందించబడుతుంది. మెరిట్ స్కాలర్‌షిప్ పొందిన బాలికలు ఈ పాఠశాలలో XII తరగతి వరకు (సైన్స్ స్ట్రీమ్) విద్యను అభ్యసించవలసి ఉంటుంది, ఇది విఫలమైతే, బదిలీ సర్టిఫికేట్ జారీ సమయంలో అమ్మాయి అందుకున్న పూర్తి స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి పొందబడుతుంది.
అడ్మిషన్ విధానం: జాతీయ స్థాయిలో రాత పరీక్ష ఆఫ్ లైన్ విధానంలో నిర్వహిస్తారు. అందులో అర్హత పొందిన వారికి ఇంటర్య్వూలు, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్టులు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.10.2023.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 15.12.2023.
🔰 రూ.2500 ఆలస్యరుసుముతో సాధారణ అభ్యర్థులకు: 16.12.2023 నుంచి 30.12.2023.
🔰 రూ.2100 ఆలస్యరుసుముతో ఎస్సీ ఎస్టీలకు(కర్ణాటకలో నివసిస్తున్న వారికి మాత్రమే): 16.12.2023 నుంచి 30.12.2023.
🔰 పరీక్ష తేదీ: 28.01.2024.
ALSO READ:
విద్యార్థులకు యూజీసీ గుడ్ న్యూస్, ఫెలోషిప్ సాయం పెంపు - ఎప్పటినుంచి వర్తిస్తుందంటే?
విద్యార్థులకు యూజీసీ ఫెలోషిప్‌ల కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పెంచింది. దీనివల్ల దేశంలోని దాదాపు 31 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చూకూరనుంది. 2023 జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని యూజీసీ పేర్కొంది. 2023, జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని యూజీసీ పేర్కొంది. పెరిగిన ఈ ఫెల్‌షిప్ మొత్తాలు ప్రస్తుతం యూజీసీ నుంచి ఫెలోషిప్స్ పొందుతున్నవారికి మాత్రమే వర్తించనున్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
యూజీసీ 'వాట్సాప్ ఛానల్' ప్రారంభం, విద్యార్థులకు మరింత చేరువగా సేవలు
దేశంలోని ఉన్నత విద్యాసంస్కరణల్లో భాగంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మరో ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, విద్యార్థులు మరియు అధ్యాపకులు మరియు ఇతర వాటాదారులందరితో అనుసంధానం కోసం కొత్త వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం 'యూజీసీ వాట్సాప్ ఛానెల్'ను ప్రారంభించింది. అందరికీ అధికారిక సమచారాన్ని వేగంగా అందించడం కోసం దీన్ని ప్రారంభించినట్లు ఛైర్మన్ ఎం.జగదీశ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. యూజీసీ ఇండియా వాట్సాప్ ఛానెల్‌ని ప్రారంభించడం అనేది మరింత సమగ్రమైన మరియు సమాచారంతో కూడిన ఉన్నత విద్యా రంగాన్ని పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన అన్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..