బెంగళూరులోని కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్ (KIOCL) పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులని మైనింగ్, ఫైనాన్స్, మెటీరియల్, కమర్షియల్, ఎలక్ట్రికల్, ట్రైనింగ్ అండ్ సేఫ్టీ, జియాలజీ, స్ట్రక్చరల్, సర్వే విభాగాలలో భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 3 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవచ్చు.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 17


1) చీఫ్ జనరల్ మేనేజర్: 01 పోస్టు


2) జనరల్ మేనేజర్: 03 పోస్టులు


3) డిప్యూటీ జనరల్ మేనేజర్: 01 పోస్టు


4) అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 03 పోస్టులు


5) సీనియర్ మేనేజర్: 03 పోస్టులు


6)  మెడికల్ సూపరింటెండెంట్: 01 పోస్టు


7) డిప్యూటీ మేనేజర్: 02 పోస్టులు


8) అసిస్టెంట్ మేనేజర్: 01 పోస్టు


9) కన్సల్టెంట్: 02 పోస్టులు


విభాగాలు:  మైనింగ్, ఫైనాన్స్, మెటీరియల్, కమర్షియల్, ఎలక్ట్రికల్, ట్రైనింగ్ అండ్ సేఫ్టీ, జియాలజీ, స్ట్రక్చరల్, సర్వే.


అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


ఎంపిక ప్రక్రియ: పర్సనల్ ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.



ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభతేది: 21.11.2022.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03.12.2022.


➥ దరఖాస్తు హార్డుకాపీ స్వీకరణకు చివరి తేదీ: 09.12.2022.


Notification


Online Application


Website


Also Read:


ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
నోయిడా ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దీని ద్వారా డిప్యూటీ డైరెక్టర్, EDP అసిస్టెంట్, జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఇంటర్, సంబధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. మాన్యువల్ టైప్‌రైటర్‌పై లేదా కంప్యూటర్‌లో స్పీడ్‌గా టైప్ చేయకలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబర్ 12 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఈపీఐఎల్‌లో మేనేజర్‌ ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోండి!
ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్(ఈపీఐఎల్) మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఏఎంఐఈ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు నవంబరు 29లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

డీఆర్‌డీవో ఉద్యోగాలకు ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ, చివరితేది ఎప్పుడంటే?
భార‌త ర‌క్షణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గనేజేష‌న్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని సెంట‌ర్ ఫ‌ర్ ప‌ర్సన‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో 1061 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...