తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్‌ఎఎస్)లో ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేజీబీవీ, యూఆర్‌ఎస్‌లో మొత్తం 1,241 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జూన్ 16న ప్రకటన జారీ చేసింది. కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్, పీజీసీఆర్‌టీ, సీఆర్‌టీ, పీఈటీలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో స్పెషల్ ఆఫీసర్, సీఆర్‌టీల ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని ప్రభుత్వం పేర్కొంది.
ఉద్యోగాల భర్తీకి సంబంధించి అభ్యర్థుల అర్హత, రాత పరీక్షా విధానం, పరీక్ష సిలబస్, అభ్యర్థుల ఎంపిక విధానం తదితర వివరాలతో కూడిన సమగ్ర నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో జూన్ 17 నుంచి అందుబాటులో ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. దరఖాస్తు, ఇతర వివరాలు జూన్ 25 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. అభ్యర్థులు జూన్ 26 నుంచి జులై 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులకు జులై నెలలోనే ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
పోస్టుల వివరాలు...
ఖాళీల సంఖ్య: 1,241 పోస్టులు
➥ ఎస్‌ఓలు: 42 పోస్టులు
➥ పీజీసీఈటీ: 849 పోస్టులు
➥ సీఆర్‌టీ: 273 పోస్టులు
➥ పీఈటీ: 77 పోస్టులు
ముఖ్యమైన తేదీలు...
➥ నోటిఫికేషన్ వెల్లడి: 17.06.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.06.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.07.2023.
Also Read:
గురుకులాల్లో 9,210 పోస్టుల పరీక్ష తేదీలు ఖరారు! ఎగ్జామ్స్ ఎప్పుడంటే?
తెలంగాణలోని గురుకులాల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీలను గురుకుల విద్యాలయాల సంస్థ ఖరారు చేసింది. ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల నియామక పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షల పూర్తి షెడ్యూలును ఒకట్రెండుల్లో వెల్లడించనున్నట్టు తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ నియామక బోర్డు కన్వీనర్ డా. మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు తెలిపారు. తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో మొత్తం 9210 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 9 నోటిఫికేషన్లను గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది. ఈ పోస్టులకు మొత్తం 2.63 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
కేజీబీవీ టీచింగ్ పోస్టుల ఫలితాలు విడుదల, జిల్లాలవారీగా ప్రాథమిక ఎంపిక జాబితాలు ఇలా!
ఏపీలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 1,543 టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) జిల్లాలవారీగా అభ్యర్థుల ప్రాథమిక జాబితాలను జూన్ 15న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల వివరాలను అందుబాటులో ఉంచారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జాబితాలను పొందుపరిచారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 782 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) 2023-24 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 782 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడును అనుసరించి పదోతరగతి, పన్నెండో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..