KVS Exam Results: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. కేంద్రీయ విద్యాలయాల్లో టీజీటీ (TGT), లైబ్రేరియన్ (Librarian), హిందీ ట్రాన్స్‌లేటర్ (Hindi Translator), ప్రైమరీ టీచర్ (PRT) పోస్టులకు సంబంధించిన ఫలితాలను కేంద్రీయ విద్యాలయ సంగతన్ విడుదల చేసింది. కేవీల్లో 13,404 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాతపరీక్ష నిర్వహించారు. రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతానికి టీజీటీ, లైబ్రేరియన్‌, హిందీ ట్రాన్స్‌లేటర్‌, ప్రైమరీ టీచర్‌ ఫలితాలు వెలువడగా.. మిగిలిన పోస్టుల ఫలితాలను ప్రకటించాల్సి ఉంది.


టీజీటీ పోస్టుల ఫలితాల కోసం క్లిక్ చేయండి..


పీఆర్టీ పోస్టుల ఫలితాల కోసం క్లిక్ చేయండి..


లైబ్రేరియన్ పోస్టుల ఫలితాల కోసం క్లిక్ చేయండి..


హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల ఫలితాల కోసం క్లిక్ చేయండి..


వెబ్‌సైట్


దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 13,404 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబరు 26 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.


అసిస్టెంట్‌ కమిషనర్‌, ప్రిన్సిపల్‌, వైస్‌-ప్రిన్సిపల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు రూ.2300లు, పీఆర్టీ/టీజీటీ/పీజీటీ/ఫైనాన్స్‌ ఆఫీసర్‌/ఏఈ/లైబ్రేరియన్‌/ఏఎస్‌ఓ/హెచ్‌టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రూ.1500, ఎస్‌ఎస్ఏ/స్టెనో/జేఎస్‌ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రూ.1200లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.2,09,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. 


6990 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


6414 ప్రైమరీ టీచర్ పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


ALSO READ:


ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు
న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 995 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హత గల అభ్యర్థులు డిసెంబర్‌ 15లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply