Naga Panchami November 28th Episode : మోక్ష: (మోక్ష పంచమిని ప్రేమగా దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నిస్తే పంచమి తోసేస్తుంది.) ఏమైంది పంచమి.. నాతో జీవితం పంచుకోవాలని నీకు లేదా.. పంచమి చెప్పు.. సంవత్సరం నుంచి ఏ రోజూ నేను నీ మాటకు ఎదురు చెప్పలేదు. ఎందుకు నువ్వు నాకు దూరంగా ఉన్నావనీ అడగలేదు. బలవంతంగా నీకు దగ్గర అవ్వాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. కానీ ఇప్పుడు అవసరం పంచమి. మనం కలిసి తీరాలి. ఇది నా ఆర్డర్‌ కాదు పంచమి నా రిక్వస్ట్. నేను అన్యాయం అయిన కోరిక ఏం కోరలేదు. న్యాయమైన కోరికనే కోరాను. అది కూడా నా జీవితానికి సంబంధించిన చివరి కోరిక. 


పంచమి: మోక్షబాబు దయచేసి అలా మాట్లాడకండి. 


మోక్ష: ఇందులో ఏదైనా అన్యాయం ఉంటే చెప్పు పంచమి. నాకు నాగ గండం ఉండడం నిజం. పగబట్టిన పాము ఎలా అయినా నన్ను చంపి తీరాలని పట్టు పట్టి నా వెంట పడటం నిజం. వచ్చే కార్తీక పౌర్ణమికి ఆ పాము కాటుకి నేను చావడం నిజం. 


పంచమి: వద్దు మోక్ష బాబు అలా అనొద్దు. 


మోక్ష: నాకు బతకాలి అని ఉంది పంచమి కానీ అలా జరుగుతుందని ఒక్క శాతం కూడా నాకు నమ్మకం లేదు. అందుకే అడుగుతున్నాను నా కోరిక నెరవేర్చు పంచమి. నా జీవితం నాతోనే ముగిసిపోకూడదు. ఏదో ఒక రూపంలో నేను ఈ భూమ్మీద బతికుండాలి. నా చావు ఎవరో ఒకరికి ఉపయోగపడాలి. లేదంటే నా లైఫ్‌కి అర్ధమే ఉండదు. 


పంచమి: నన్ను క్షమించండి. మీ కోరిక తీర్చలేని అభాగ్యురాలిని. మీరు ఆదేశిస్తే నా ప్రాణాలనైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీ ఆశ మాత్రం నెరవేర్చలేను. 


మోక్ష: అదే ఎందుకు అని అడుగుతున్నాను పంచమి


పంచమి: అది నేను చెప్పలేను. కానీ మీరు అనుకున్నది జరగదు


మోక్ష: జరగాలి జరిగి తీరాలి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నన్ను రాక్షసుడు అనుకున్నా సరే ఈ రోజు మాత్రం మన కలయికని ఏ కారణం ఆపలేదు. ఎవరూ అడ్డుకోలేరు. 


పంచమి: ఏడుస్తూ.. మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా మోక్ష బాబు ఈ విషయంలో నన్ను బలవంతం చేయొద్దు.


మోక్ష: ఇక నేను నీ మాట వినను పంచమి. నువ్వు నా భార్యవి. నేను నీ భర్తని. ఆ బంధం నిజం అయితే నువ్వు నాకు అడ్డు చెప్పకూడదు. చెప్పినా నేను వినను. (పంచమిని మోక్ష బలవంతంగా పట్టుకుంటే పంచమి వద్దు వద్దు అంటూ ఏడుస్తుంది. చివరకు తోసేస్తుంది.) ఆలోచించుకో పంచమి చివరి సారి చెప్తున్నా


పంచమి: నేను అదే చెప్తున్నా.. మీకోసం ప్రాణం ఇవ్వమంటే ఇస్తాను కానీ మన కలయిక జరగదు


మోక్ష: ఇలా చేస్తావు అని తెలిస్తే పోయిన పౌర్ణమికే ఆ పాము చేతిలో హాయిగా చనిపోయే వాడిని పంచమి. ప్రాణాలు కాపాడుకొని తప్పు చేశాను. పరవాలేదు నువ్వు నా ప్రాణాలు కాపాడక్కర్లేదు. నా భార్య నా మాట విననప్పుడు నేను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. నా ప్రాణాలు తీసే అవకాశం ఆ పాముకి ఇవ్వను. ఆ చనిపోయేదేదో ఇప్పుడే చనిపోతా


పంచమి: (ఏడుస్తూ మోక్ష కాలు పట్టుకొని) మోక్ష బాబు ఆ పాముని నేనే.. నేనే ఆ పాపిష్టి పాముని. 


మోక్ష: నాకు తెలుసు పంచమి. నీ జన్మ రహస్యం మొత్తం నాకు తెలుసు. నువ్వు ఇష్ట రూప నాగువని నాకు తెలుసు. నువ్వు పాము నుంచి మనిషిగా మారడం నేను చూశాను. నీ గురించి అంతా తెలుసుకున్నాను పంచమి. నువ్వు బాధ పడాల్సిన అవసరం లేదు పంచమి. నువ్వు పవిత్రం అయిన నాగకన్యవు. నువ్వు తలచుకుంటే నన్ను కాటేసి నీ కన్న తల్లి కోరిక నెరవేర్చి ఆనందంగా నాగలోకం వెళ్లిపోయేదానివి. 


పంచమి: నేను ఆ జీవితాన్ని కోరుకోలేదు. మనసావాచా నేను మీ భార్యగానే ఉండిపోవాలి. 


మోక్ష: మన ఇద్దరి జీవితాలు మనకు తెలుసు పంచమి. నా చావు నీ చేతుల్లోనే రాసిపెట్టుంది. నువ్వు పాములా మారినప్పుడు సర్వం మర్చిపోతావు. నువ్వు పాములా మారినప్పుడు నన్ను కాపాడుకోలేవు.


పంచమి: నేను కాపాడుకుంటా మోక్ష బాబు ఎలా అయినా కాపాడుకోవాలి


మోక్ష: అసలు నువ్వు ఏం ఆశపడుతున్నావో చెప్పు పంచమి


పంచమి: నేను మీ ప్రాణాలు కాపాడుకోవాలి. నేను శాశ్వతంగా మీకు భార్యగా ఉండిపోవాలి


మోక్ష: అది సాధ్యం కావాలి అంటే ఒకటే మార్గం ఉంది పంచమి. నువ్వు తల్లివి అయితే ఈ భూమ్మీద శాశ్వతంగా ఉండిపోగలవు.


పంచమి: అది అసాధ్యం బాబు.. నేను నాగకన్యను. నాతో మీరు కలిస్తే మీకు మరణం సంభవిస్తుంది. 


మోక్ష: ఆ విషయం కూడా నాకు తెలుసు పంచమి. నేను లేకపోయినా ఈ లోకంలో నువ్వైనా ఉండాలనే ఆశతోనే నీకిష్టం లేకపోయినా నిన్ను అంతగా ప్రోద్బలం చేశాను


పంచమి: మీ ప్రాణాలు కాపాడుకోవడం కోసమే బతుకుతున్నదానికి అలా జరగనిస్తానా 


మోక్ష: జరగాలి పంచమి లేదంటే నువ్వు శాశ్వతంగా ఈ లోకంలో ఉండలేవు అంటూ మరోసారి పంచమిని దగ్గరకు తీసుకోగా అక్కడికి పాము రూపంలో ఫణేంద్ర వస్తాడు. ఆ పామును పంచమి పట్టుకుంటుంది. మరోవైపు మోక్ష తలకు దెబ్బతగిలి కళ్లుతిరిగి పడిపోతాడు.


మోక్షని కాటేస్తానని ఫణేంద్ర అంటే పంచమి అడ్డుకుంటుంది. మోక్షని కాటేసి చంపాల్సిన బాధ్యత తనది అని అలా ఇంకా ఎవరైనా చేస్తే ఊరుకోను అని  పంచమి హెచ్చరిస్తుంది. ఫణేంద్రను అక్కడి నుంచి వెళ్లిపోమని ఆజ్ఞాపిస్తుంది. మరోవైపు మోక్ష లేస్తాడు. తమ చుట్టూ చాలా శక్తులు తిరుగుతున్నాయని.. తాము కలవకూడదని.. తొందర పడకుండా జాగ్రత్తగా ఉండాలి అని పంచమి చెప్పి ఏడుస్తుంది. 


మరోవైపు నాగదేవత ప్రత్యక్షమవుతుంది. నాగలోకానికి ఫణేంద్ర వెళ్తాడు. మోక్షకు పంచమి గురించి మొత్తం తెలుసు అని నాగదేవతకు చెప్తాడు. నాగ దేవత అంతా తనకు తెలుసని చెప్తుంది. ఇక పంచమికి సుబ్రహ్మణ్య స్వామి తోడు ఉన్నారని.. అయితే స్వామి పంచమి పాముగా మారితేనే నాగలోకం తీసుకెళ్లమని చెప్పారని ఫణేంద్ర వివరిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply*