కాకినాడలోని కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ పలు శాఖల్లో ఆఫీసర్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆఫీసర్ క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అసిస్టెంట్ సీఈవో, మేనేజర్ పోస్టులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
వివరాలు..
* పోస్టుల సంఖ్య: 33.
1) అసిస్టెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఏసీఈవో): 02 పోస్టులు
2) మేనేజర్-లా: 01 పోస్టు
3) ఆఫీసర్: 09 పోస్టులు
4) క్లర్క్ కమ్ క్యాషియర్: 16 పోస్టులు
5) అటెండర్(సబ్ స్టాఫ్): 05 పోస్టులు అర్హత: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు తగిన పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 06.10.2023 నాటికి 34 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. బీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజు: ఆఫీసర్ క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. అదేవిధంగా అసిస్టెంట్ సీఈవో, మేనేజర్ పోస్టులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ''The Kakinada Co-Operative Town Bank Ltd, Kakinada” పేరిట కాకినాడలో చెల్లుబాటు అయ్యేలా నిర్ణీత మొత్తంతో డిడి తీయాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తులు నింపి రిజిస్టర్డ్ పోస్టు/ కొరియర్ ద్వారా సంబంధిత చిరునామాకు నిర్ణీత గడువులోగా చేరేలా పంపాలి. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:The Chief Executive Officer Kakinada Cooperative Town Bank LtdHead Office: D.No.11-3-6, Veterinary Hospital Street, Rama Rao Peta, Kakinada-533004, Kakinada Dist, Andhra Pradesh.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 31.10.2023.
ALSO READ:
ఆర్‌బీఐ అసిస్టెంట్ పోస్టుల నియామక పరీక్ష తేదీలు వెల్లడి - ప్రిలిమ్స్, మెయిన్ ఎగ్జామ్స్ ఎప్పుడంటే?ఆర్‌బీఐలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్షల కొత్త షెడ్యూలును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబరు 6న విడుదల చేసింది. గతంలో పేర్కొన్నవ కాకుండా కొత్త పరీక్ష తేదీలను ఆర్‌బీఐ తాజాగా ప్రకటించింది. తాజా షెడ్యూలు ప్రకారం నవంబర్ 18, 19 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ 31న ప్రధాన పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎస్‌బీఐ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 16న ప్రారంభంకాగా.. అక్టోబరు 6 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అయితే దరఖాస్తు గడువును అక్టోబరు 21 వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులు అక్టోబరు 21లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పీవో పోస్టుల దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..