Indian Army NCC Special Entry Scheme: ఇండియన్ ఆర్మీలో 'ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్' 56వ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్లుగా చేరేందుకు 2024 అక్టోబరులో ప్రారంభమయ్యే కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏదైనా డిగ్రీతోపాటు ఎన్‌సీసీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జనవరి 8న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

➥ ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ (56వ కోర్సు) -  షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్‌సీ) ఆఫీసర్లు

* మొత్తం ఖాళీలు: 55

1) ఎన్‌సీసీ (మెన్): 50 పోస్టులు

పోస్టుల కేటాయింపు: జనరల్ కేటగిరీ-45, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి-05.

2)  ఎన్‌సీసీ (ఉమెన్): 05 పోస్టులు

పోస్టుల కేటాయింపు: జనరల్ కేటగిరీ-04, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి-01.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు ఎన్‌సీసీ‌ సర్టిఫికెట్ ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. వీరికి ఎన్‌సీసీ సర్టిఫికెట్ అవసరం లేదు.

వయోపరిమితి: 01.07.2024 నాటికి 19-25 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1999 - 01.07.2005 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇతర అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారికి ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇది రెండు దశల్లో ఈ ప్రక్రియ ఉంటుంది.  స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు ఉంటాయి. స్టేజ్-1లో ఫెయిల్ అయిన అభ్యర్థులను స్టేజ్-2కి ఎంపిక చేయరు, వారు అదే రోజు తిరిగివెళ్లొచ్చు. స్టేజ్-1లో ఎంపిక అయిన అభ్యర్థులకు స్టేజ్-2 ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ ఉంటుంది. ఇందులో ఎంపిక అయిన వారికి చివరగా మెడికల్ టెస్ట్ ఉంటుంది.

స్టైపెండ్: నెలకు రూ.56,100 చెల్లిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత లెఫ్టినెంట్ హోదాలో పోసింగ్ ఇస్తారు. నిర్ణీత పేస్కేలు ప్రకారం ఇతర అలవెన్సులు ఇస్తారు.

పేస్కేలు ఇలా..

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.01.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.02.2024.

Notification

Online Application

Website

                                   

ALSO READ:

ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్‌) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్, వివరాలు ఇలాఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచుల్లో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 35 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కనీసం 70 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్ష (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌)ఉత్తీర్ణతతో పాటు జేఈఈ (మెయిన్)-2023 పరీక్షలో ర్యాంకు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు జనవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ ఉంటుంది. జేఈఈ (మెయిన్)-2023 ర్యాంక్, పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..