US Consulate General Hyderabad: హైదరాబాద్‌లోని యూఎస్ ఎంబసీ మేసన్ (తాపీ మేస్త్రీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫుల్ టైమ్ జాబ్‌గా ఉండే ఈ పోస్టులకు వార్షిక వేతనం రూ.4,47 లక్షలుగా నిర్ణయించారు. నెలవారీగా చూస్తే రూ.37,279 ఇవ్వనున్నారు. జీతంతో పాటు అదనపు ప్రయోజనాలు కూడా ఇస్తారు. ఈ ఉద్యోగానికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని యుఎస్ కాన్సుల్ వర్గాలు ప్రకటించాయి. ఇది అమెరికన్ కాన్సుల్‌లో శాశ్వత ఉద్యోగంగా ఉండనుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారు తప్పనిసరిగా ప్రొబేషన్ పీరియడ్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. వారానికి 40 గంటలు విధిగా పనిచేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ తర్వాత కనీసం 4 నుండి 8 వారాల్లో నియామకాలు చేపడతారు. హెల్పర్, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కూడా దరఖాస్తులు కోరుతున్నారు.


వివరాలు...


➥ మేసన్ (తాపీ మేస్త్రీ): 01 పోస్టు


అర్హత: అభ్యర్థి కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్ భాష అర్థం చేసుకోగలగాలి. లెవెల్ 1 ఇంగ్లిష్ ప్రావీణ్యం పరీక్షించబడుతుంది. తెలుగు, హిందీ తెలిసిఉండాలి. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు వైద్య పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. సెక్యూరిటీ క్లియరెన్స్‌లలో అర్హత సాధించాలి.


అనుభవం: మేసన్ పోస్టులకు సంబంధించి కనీసం రెండేళ్ల ప్రొఫెషనల్ అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విధుల్లో భాగంగా కొత్త గోడల నిర్మాణం, కాంక్రీట్ సహా రాతి పనులు చేయాల్సి ఉంటుంది. కాంక్రీట్ మిక్సర్ల రకాలు, వివిధ ఇటుకలతో నిర్మాణం, ఫ్లోరింగ్ పనులు, మార్బుల్ ఫ్లోరింగ్, హాలో బ్రిక్స్, రాతి నిర్మాణంలో అనుభవం ఉండాలి. అంతే కాకుండా వివిధ పనులకు సంబంధించిన మెటీరియల్ ఎస్టిమేషన్లు సిద్ధం చేయాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం ఆధారంగా.


జీతం:వార్షిక వేతనం రూ.4,47 లక్షలు.


చివరితేది: 25.02.2024.


Notification & Online Application



➥ ట్రేడ్ హెల్పర్: 01 పోస్టు


అర్హత: కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 


అనుభవం: అభ్యర్థులు తప్పనిసరిగా ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. దీనితో పాటు సెమీ స్కిల్ టాస్క్‌లు తెలుసుకోవాలి. ప్లంబింగ్, ఎలక్ట్రికల్, కార్పెంటరీ మరియు ఇతర పనులలో అనుభవం ఉండాలి. నిర్మాణ సంబంధిత పనులు, మరమ్మతులు, మెటీరియల్ అంచనాల తయారీలో అనుభవం ఉండాలి. దరఖాస్తులో పేర్కొన్న వివరాల ప్రకారం అభ్యర్థి విద్యార్హత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం ఆధారంగా.


జీతం: వార్షిక వేతనం రూ.3,84,265 చెల్లిస్తారు. US ఎంబసీలలో పని చేసే ఇతర జాతీయులకు వర్తించే ప్రయోజనాలు అందించబడతాయి. ఇందులో భాగంగానే ఆరోగ్య సదుపాయాలు, ఇతర ప్రయోజనాలు వర్తిస్తాయి.


చివరితేది: 11.02.2024.


Notification & Application


➥ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అసిస్టెంట్: 07 పోస్టులు


అర్హత: కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 


అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇంగ్లిష్, తెలుగు/హిందీ/ఒరియా/ఉర్దూ చదవడం, రాయడం తెలిసి ఉండాలి.  


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం ఆధారంగా.


జీతం: వార్షిక వేతనం రూ.3,84,265 చెల్లిస్తారు. US ఎంబసీలలో పని చేసే ఇతర జాతీయులకు వర్తించే ప్రయోజనాలు అందించబడతాయి. ఇందులో భాగంగానే ఆరోగ్య సదుపాయాలు, ఇతర ప్రయోజనాలు వర్తిస్తాయి.


చివరితేది: 18.02.2024.


Notification & Application


Website