ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్, డిసెంబరు 17న వరంగల్ ములుగు రోడ్డు ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్ సమీపంలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. కరీంనగర్ వెంకట సాయి ఎంటర్ ప్రైజెస్ కంపెనీలో 121 ఉద్యోగాల భర్తీ కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.


ఎంపికైన అభ్యర్థులు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు 18 నుంచి 35 సంవత్సరాలు ఉండి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు.


ఆసక్తి గల యువతీ యువకులు తమ విద్యార్హతల సర్టిఫికెట్స్ జిరాక్స్ పత్రాలతో ఆరోజు ఉదయం 11గంటలకు జరుగు జాబ్ మేళాకు హాజరు కావాలని కోరారు. ఇతర వివరాలకు 9848895937 నెంబరులో సంప్రదించాలని డీఈఓ మల్లయ్య సూచించారు.


Also Read:


1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో జూనియర్ లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు మల్టీ జోన్-1 పరిధిలో 724 పోస్టులు, మల్టీ జోన్-2 పరిధిలో 668 పోస్టులు ఉన్నాయి. డిసెంబరు 16 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ లేదా జులైలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఖాళీల్లో అత్యధికంగా మ్యాథ్స్-154, ఇంగ్లిష్-153, జువాలజీ-128, హిందీ-117; బోటనీ,కెమిస్ట్రీ-113 పోస్టులు, ఫిజక్స్-112 పోస్టులు ఉన్నాయి.  కాగా.. జూనియర్‌ లెక్చరర్ల పోస్టుల్లో ఉర్దూ, మరాఠీ మీడియం పోస్టులకు పదో తరగతి వరకు ఆయా మీడియంలలో చదువుకున్నవారు లేదా పదోతరగతిలో ఆయా భాషలు ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా ఉన్నా.. బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో సెకండ్‌ లాంగ్వేజ్‌గా ఉన్న వారు ఈ మీడియంలోని పోస్టులకు అర్హులని విద్యాశాఖ వెల్లడించింది. జేఎల్‌ సివిక్స్‌ పోస్టులకు పొలిటికల్‌ సైన్స్‌ లేదా పబ్లిక్‌ అడ్మినిస్ర్టేషన్‌ సబ్జెక్టుల్లో పీజీ చేసి 50 శాతం మార్కులు పొందిన వారు అర్హులని పేర్కొంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్  విడుదల చేసింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో పోస్టుల వివరాలు అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. 19 సబ్జెక్టుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబర్ 14 నుంచి జనవరి 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో బ్యాచీలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ) అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...