జనగామ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్. జిల్లా ఉపాధిశాఖ ఆధ్వర్యంలో మే 23న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి సీహెచ్‌.ఉమారాణి మే 19న‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు సెక్టార్‌లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.


హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో కస్టమర్‌ సర్వీసు ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో 300 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్‌ లేదా డిగ్రీ ఉత్తీర్ణులై, 18 నుంచి 35 సంవత్సరాలలోపు వయసున్న వారు మే 23వ తేదీ ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించే ముఖాముఖిలో సంబంధిత విద్యార్హతల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని ఆమె సూచించారు. పూర్తి వివరాలకు 79954 30401 నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


వివరాలు..


* జాబ్ మేళా


ఖాళీల సంఖ్య: 300


అర్హత: ఇంటర్ లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 18 నుంచి 35 సంవత్సరాలలోపు ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా.


ఇంటర్వ్యూ తేది: 23.05.2023.


ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10.30 గంటల నుంచి.


సంప్రదించాల్సి ఫోన్ నెంబర్: 79954 30401.


Also Read:


ఇండియన్ నేవీలో 372 ఛార్జ్‌మ్యాన్ పోస్టులు, అర్హతలివే!
ఇండియన్‌ నేవీలో సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా ఛార్జ్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన అభ్యర్థులు హెడ్‌క్వార్టర్స్ వెస్ట్రన్ నేవల్ కమాండ్ (ముంబయి), హెడ్‌క్వార్టర్స్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ (విశాఖపట్నం), హెడ్‌క్వార్టర్స్ సదరన్ నేవల్ కమాండ్ (కొచ్చి), హెడ్‌క్వార్టర్స్ అండమాన్ అండ్‌ నికోబార్ కమాండ్ (పోర్ట్ బ్లెయిర్) యూనిట్లలో పని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి మే 15న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు మే 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 103 నర్స్‌, పారామెడికల్‌ పోస్టులు- అర్హతలివే!
తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎల్‌సీ) నర్స్‌, పారామెడికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 103 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎస్‌ఎఎస్‌ఎల్‌సీ, హెచ్‌ఎస్‌సీ, 12వ తరగతి, బ్యాచిలర్‌ డిగ్రీ, బీఎస్సీ, బీఎన్‌టీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మే 12 నుంచి జూన్ 01 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి...


రిజర్వ్ బ్యాంకులో 291 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు, అర్హతలివే!
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 291 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. రెండు దశల ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. సరైన అర్హతలున్నవారు మే 9 నుంచి జూన్ 9 మధ్య ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..