ఏపీలో ఇంటర్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో కళాశాలల ప్రిన్సిపాళ్ల లాగిన్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచినట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిన్సిపాళ్లు వాటిని డౌన్‌లోడ్ చేసి, విద్యార్థులకు అందించాలని ఆయన సూచించారు.
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్ 1 వరకు జరగనున్నాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో తప్పిన వారితోపాటు ఇంప్రూమెంట్ కోసం రాసే వారు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ విద్యార్ధులకు, అదేరోజు మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు సెకండియర్ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్షలు ఇలా..
➥ మే 24న ఉదయం సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1, మధ్యాహ్నం సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు జరుగుతాయి.
➥ మే 25న ఉదయం ఇంగ్లిష్ పేపర్- 1, మధ్యాహ్నం ఇంగ్లిష్ పేపర్-2 పరీక్షలు జరుగుతాయి.
➥ మే 26న ఉదయం మ్యాథమెటిక్స్-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్-పేపర్-1 పరీక్షలు జరుగుతాయి. మద్యాహ్నం మ్యాథ్స్-2ఎ, బోటనీ పేపర్-2, సివిక్స్ పేపర్-2 జరుగుతాయి.
➥ మే 27న మ్యాథ్స్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1 పరీక్షలు జరుగుతాయి. అదే రోజు మధ్యాహ్నం మ్యాథ్స్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2 పరీక్షలు జరుగుతాయి.
➥ మే 29న ఫిజిక్స్ పేపర్-1, ఎకనమిక్స్ పేపర్-1 పరీలు జరుగుతాయి. అదేరోజు మధ్యాహ్నం ఫిజిక్స్ పేపర్-2, ఎకనమిక్స్ పేపర్-2 పరీక్షలు జరుగుతాయి.
➥ మే 30న కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1 పరీక్షలు జరుగుతాయి. అదే రోజు మధ్యాహ్నం కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2, సోసియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తారు.
➥ మే 31న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1 జరుగుతాయి. అదే రోజు మధ్యాహ్నం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-2 పరీక్షలు జరుగుతాయి. జూన్ 1న ఉదయం మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1 పరీక్షలు జరుగుతాయి. అదే రోజు మధ్యాహ్నం మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2 పరీక్షలు జరుగుతాయి.
Also Read:
ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల, 86.35 శాతం ఉత్తీర్ణత - డైరెక్ట్ లింక్ ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవశాలకు నిర్వహించిన 'ఏపీ పాలిసెట్-2023' ఫలితాలు వెలువడ్డాయి. విజయవాడలో శనివారం ఉదయం 10.45 గంటలకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పాలిసెట్ ఫలితాల్లో 86.35 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 15 మంది విద్యార్థులకు 120కి 120 మార్కుల వచ్చాయి. పాలిసెట్ ఫలితాల్లో విశాఖపట్టణానికి చెందిన విద్యార్థి మొదటి స్థానంలో నిలిచాడు.
పాలిసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
సీయూఈటీ యూజీ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష తేదీలివే!
దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేవశాలకు నిర్వహించే 'కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ యూజీ-2023' పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 21 నుంచి జూన్ 2వ తేదీ వరకు; అదేవిధంగా.. జూన్ 5, 6 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే ప్రస్తుతానికి మే 21, 22, 23, 24 తేదీల్లో జరిగే పరీక్షల అడ్మిట్ కార్డులను మాత్రమే ఎన్టీఏ విడుదల చేసింది. మిగతా తేదీల్లో జరిగే పరీక్షల అడ్మిట్ కార్డులను త్వరలోనే అందుబాటులో ఉంచనున్నారు.
CUET UG - 2023 అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..