పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ గ్రూప్-బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుని అనుసరించి 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 22 నుంచి మార్చి 18 వరకు ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 69
* గ్రూప్-బి పోస్టులు: 14
➥ డెంటల్ హైజినిస్ట్: 01
➥ జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్: 01
➥ మెడికల్ సోషల్ వర్కర్: 06
➥ స్పీచ్ థెరపిస్ట్: 02
➥ ఎక్స్-రే టెక్నీషియన్ (రేడియోథెరపీ): 04
* గ్రూప్-సి పోస్టులు: 55
➥ అనస్థీషియా టెక్నీషియన్: 08
➥ ఆడియోలజీ టెక్నీషియన్: 01
➥ డెంటల్ మెకానిక్: 01
➥ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 32
➥ ఆప్తాల్మిక్ టెక్నీషియన్: 01
➥ పెర్ఫ్యూషన్ అసిస్టెంట్: 01
➥ ఫార్మసిస్ట్: 05
➥ ఫిజియోథెరపీ టెక్నీషియన్: 02
➥ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ - II: 03
➥ URO టెక్నీషియన్: 01
అర్హతలు: పోస్టుని అనుసరించి 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18.03.2023 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1,500; ఓబీసీలకు రూ.1,500; ఎస్సీ/ఎస్టీలకు రూ.1,200. దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు: పోస్టుని అనుసరించి రూ.19,900 - రూ.35400 చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 22.02.2023.
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 18.03.2023.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 25.03.2023.
➥ పరీక్ష తేదీ: 02.04.2023.
Also Read:
అస్సాం రైఫిల్స్‌లో 616 టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ పోస్టులు - అర్హతలివే!
షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్, డైరెక్టర్ జనరల్ కార్యాలయం గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీల భర్తీకి సంబంధించి మే నెలలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు మార్చి 19 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐడీబీఐ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 114 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు మార్చి 3 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..