పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యూయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్- గ్రూప్ బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 97 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంఫిల్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 97
* గ్రూప్-ఎ (నాన్ ఫ్యాకల్టీ) పోస్టులు: 31
స్పెషలిస్ట్: 09
విభాగాలు: అనస్థీషియాలజీ, కార్డియాలజీ, మెడిసిన్, నెఫ్రాలజీ, ప్రసూతి శాస్త్రం &గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, రేడియో డయాగ్నోసిస్, సర్జరీ.
వయోపరిమితి: 18-40 సంవత్సరాలు వరకు.
పే స్కేల్: రూ.67,700.
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్: 20
వయోపరిమితి: 18-35 సంవత్సరాల వరకు.
పే స్కేల్: రూ.56,100.
చైల్డ్ సైకాలజిస్ట్: 02
వయోపరిమితి: 18-35 సంవత్సరాల వరకు.
పే స్కేల్: రూ.56,100.
* గ్రూప్-బి పోస్టులు: 61
నర్సింగ్ ఆఫీసర్: 25
వయోపరిమితి: 18-35 సంవత్సరాల వరకు.
పే స్కేల్: రూ.44,900.
ఎక్స్-రే టెక్నీషియన్ (రేడియో-డయాగ్నోసిస్): 05
వయోపరిమితి: 18-30 సంవత్సరాల వరకు.
పే స్కేల్: రూ.35,400.
జూనియర్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్: 02
వయోపరిమితి: 18-35 సంవత్సరాల వరకు.
పే స్కేల్: రూ.35,400.
జూనియర్ ఫిజియోథెరపిస్ట్: 02
వయోపరిమితి: 18-35 సంవత్సరాల వరకు.
పే స్కేల్: రూ.35,400.
మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్: 27
వయోపరిమితి: 18-30 సంవత్సరాల వరకు.
పే స్కేల్: రూ.35,400.
* గ్రూప్-సి పోస్టులు: 05
ఫార్మసిస్ట్: 01
వయోపరిమితి: 18-30 సంవత్సరాల వరకు.
పే స్కేల్: రూ.29,200.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2: 02
వయోపరిమితి: 18-27 సంవత్సరాల వరకు.
పే స్కేల్: రూ.25,500.
జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 2
వయోపరిమితి: 18-30 సంవత్సరాల వరకు.
పే స్కేల్: రూ.19,900.
అర్హతలు: పోస్టును అనుసరించి 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంఫిల్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: యూఆర్/ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1,500; ఓబీసీలకు రూ.1,500; ఎస్సీ/ ఎస్టీలకు రూ.1,200. దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 16.11.2023.
➥ హాల్ టికెట్ డౌన్‌లోడ్: 24.11.2023 నుంచి.
➥ పరీక్ష తేదీ: 02.12.2023.
ALSO READ:
నిమ్‌హాన్స్‌లో 161 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నర్సింగ్ విభాగంలో డిగ్రీతోపాటు తగిన అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 18 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగాలను భర్తీచేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1,180 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ.885 చెల్లిస్తే సరిపోతుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ అర్హతతో 436 ఎయిర్‌పోర్ట్ కొలువులు - ఎంపిక ఇలా!
న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్, దేశవ్యాప్తంగా ఏఏఐసీఎల్‌ఏఎస్ కేంద్రాల్లో అసిస్టెంట్(సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇంటర్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
శ్రీహరికోట-సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఎస్డీఎస్సీ షార్ సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. నెలకు రూ.79,662 జీతంగా ఇస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..