IWST Recruitment: బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఐడబ్ల్యూఎస్‌టీ) టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 14 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెట్రిక్యులేషన్, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


వివరాలు..


* టెక్నికల్ అసిస్టెంట్


ఖాళీల సంఖ్య: 14


విభాగాలు: కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బోటనీ.


టెక్నీషియన్‌: 10


విభాగాలు: మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, బాయిలర్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, కార్పెంటర్.


డ్రైవర్(ఆర్డినరీ గ్రేడ్): 01 


అర్హత: మెట్రిక్యులేషన్, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 


వయోపరిమితి: డ్రైవర్ పోస్టులకు 18-27 సంవత్సరాలు. ఇతర పోస్టులు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ విధానంలో. 


ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


చిరునామా: The Director, 
                     ICFRE-Institute of Wood Science and Technology, 
                     18th Cross, Malleswaram, Bengaluru- 560003. 


దరఖాస్తుకు చివరితేది: 30.10.2023.


Notification & Application


Website


ALSO READ:


ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్‌లో 323 ఉద్యోగాలు, వాక్‌ఇన్ తేదీలివే
ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏఎస్‌ఎల్‌) ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ ఆఫీసర్ టెక్నిషియల్, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ & హ్యాండీ మ్యాన్/ఉమెన్ భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 323 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ (ఇంజినీరింగ్ డిసిప్లిన్) కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు పోస్టుని అనుసరించి అక్టోబర్ 17, 18, 19 తేదీలలో ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. 
పోస్టులు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..


నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌‌లో 48 ఖాళీలు
న్యూఢిల్లీలోని నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎన్‌బీఈఎంస్‌) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 30న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 20 వరకు కొనసాగనుంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష/ స్కిల్‌టెస్ట్‌ ద్వారా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎయిమ్స్‌-నాగ్‌పుర్‌లో 68 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు, అర్హతలివే!
నాగ్‌పుర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) వివిధ నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 68 పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2/ డిగ్రీ/ ఎంబీఏ/ ఎంఎస్సీ/ పీజీ డిగ్రీ/ ఎంఏ/ పీజీ డిప్లొమా/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.  కంప్యూటర్‌ టెస్ట్‌/ స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..