IREL: ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్‌లో ట్రేడ్స్‌మెన్ ట్రైనీ పోస్టులు, వివరాలు ఇలా

IREL Trademan Trainee Recruitment: ముంబయిలోని ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్(ఐఆర్ఈఎల్) వివిధ విభాగాల్లో ట్రేడ్స్‌మెన్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Continues below advertisement

IREL Trademan Trainee Recruitment: ముంబయిలోని ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్(ఐఆర్ఈఎల్) వివిధ విభాగాల్లో ట్రేడ్స్‌మెన్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 67 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 12వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, దివ్యాంగ & మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి ఉంది. సరైన అర్హతలున్నవారు మార్చి 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఒడిశా, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్–భోపాల్,   ఆంధ్రప్రదేశ్– విశాఖపట్నంలో పని చేయాల్సి ఉంటుంది.

Continues below advertisement

వివరాలు..

ఖాళీల సంఖ్య: 67

* ట్రేడ్స్‌మెన్ ట్రైనీ పోస్టులు

⏩ OSCOM యూనిట్ ఒడిషా..

➥ ట్రేడ్స్‌మన్ ట్రైనీ (ఐటీఐ-ఫిట్టర్): 13

➥ ట్రేడ్స్‌మన్ ట్రైనీ (ఐటీఐ-ఎలక్ట్రీషియన్): 12

⏩ చవర యూనిట్ కేరళ..

➥ ట్రేడ్స్‌మన్ ట్రైనీ (ఐటీఐ-ఫిట్టర్): 15

➥ ట్రేడ్స్‌మన్ ట్రైనీ (ఐటీఐ-అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్(AOCP)): 01

⏩ MK యూనిట్ తమిళనాడు..

➥ ట్రేడ్స్‌మన్ ట్రైనీ (ఐటీఐ-ఫిట్టర్): 14

➥ ట్రేడ్స్‌మన్ ట్రైనీ (ఐటీఐ-ఎలక్ట్రీషియన్): 02

⏩ RETTP, భోపాల్, మధ్యప్రదేశ్..

➥ ట్రేడ్స్‌మన్ ట్రైనీ (ఐటీఐ-ఫిట్టర్): 02

➥ ట్రేడ్స్‌మన్ ట్రైనీ (ఐటీఐ-ఎలక్ట్రీషియన్): 01

➥ ట్రేడ్స్‌మన్ ట్రైనీ (ఐటీఐ-అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్(AOCP)): 02

⏩ REPM, వైజాగ్, ఆంధ్ర ప్రదేశ్..

➥ ట్రేడ్స్‌మన్ ట్రైనీ (ఐటీఐ-ఫిట్టర్): 02

➥ ట్రేడ్స్‌మన్ ట్రైనీ (ఐటీఐ-ఎలక్ట్రీషియన్): 01

➥ ట్రేడ్స్‌మన్ ట్రైనీ (ఐటీఐ-అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్(AOCP)): 02

జాబ్ లోకేషన్: ఒడిశా, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్–భోపాల్,   ఆంధ్రప్రదేశ్– విశాఖపట్నం.

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 12వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ(జనరల్) అభ్యర్థులకు 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ(ఓబీసీ) అభ్యర్థులకు 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ(ఎస్సీ/ఎస్టీ) అభ్యర్థులకు 15 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, దివ్యాంగ & మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి ఉంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా.

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి.  ఒక్కో పేపరులో 50 చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1 అభ్యర్థి సబ్జెక్టుకు సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 50 ప్రశ్నలు-50 మార్కులు, పేపర్-2(జనరల్ నాలెడ్జ్/ జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్) నుంచి 50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్షలో కనీస అర్హత మార్కులను ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులకు 40 శాతంగా; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 35 శాతంగా నిర్ణయించారు. 

శిక్షణ సమయంలో స్టైఫండ్: నెలకు రూ.20,000

వేతనం: నెలకు రూ.20,000-88,000.

ముఖ్యమైన తేదీలు:

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.02.2024.

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15.03.2024.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement