ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్(IRCTC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిద్వారా సౌత్ సెంట్రల్ జోన్‌లోని నామినేటెడ్ మొబైల్/ స్టాటిక్ క్యాటరింగ్ యూనిట్లలో హాస్పిటాలిటీ మానిటర్ ఖాళీలను భర్తీ చేయనుంది.
వివరాలు..
* హాస్పిటాలిటీ మానిటర్: 60 పోస్టులు
అర్హత: 2021, 2022 విద్యా సంవత్సరాల్లో బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) ఉత్తీర్ణులైన వారు అర్హులు.
వయోపరిమితి: 01.08.2022 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలపాటు వయో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం: విద్యార్హత, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పని ప్రదేశం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్.
జీత భత్యాలు: నెలకు రూ.30,000.
ముఖ్యమైన తేదీలు..
* వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీలు:
ఆగస్టు 24, 25 తేదీల్లో..
వేదిక: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దగ్గర, వీవీఎస్ నగర్, భువనేశ్వర్, ఒడిశా.
ఆగస్టు 27, 28 తేదీల్లో..
వేదిక: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఎఫ్-రో, విద్యానగర్, డీడీ కాలనీ, హైదరాబాద్, తెలంగాణ.
Notification & Application
Website
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 323 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, టైపింగ్ తెలిసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మూడుదశల్లో ఉద్యోగ ఎంపికలు చేపడతారు. మొదటి దశలో రాతపరీక్ష; రెండో దశలో ఫిజికల్ మెజర్‌మెంట్, స్టెనోగ్రఫీ (ఏఎస్‌ఐ)/టైపింగ్(హెడ్ కానిస్టేబుల్), మెడికల్ టెస్ట్ ఆధారంగా ప్రతిభ కనబరచిన అభ్యర్థులతో మెరిట్ జాబితాను సిద్ధంచేసి ఉద్యోగ నియామకాలు చేపడతారు.
దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) విభాగం కానిస్టేబుల్(పయోనిర్) గ్రూప్-సి పరిధిలోని నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండి, గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆగస్టు 19 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు, దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో 2,318 పారా మెడికల్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా!!
ఏపీ వైద్యారోగ్య శాఖ వివిధ జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్), ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) విభాగాల పరిధిలోని పారా మెడికల్, ఇతర పోస్టుల భర్తీకి ఒప్పంద/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. నిర్ణీత అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టులు, దరఖాస్తు వివరాలు...
మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...