ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్ గ్రాడ్యుయేట్& టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 55 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 04 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 55
విభాగాలు: కంప్యూటర్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజినీరింగ్.
* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ పోస్టులు: 31
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.10500 చెల్లిస్తారు.
* టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ పోస్టులు: 24
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.9400 చెల్లిస్తారు.
అప్రెంటిస్‌షిప్ వ్యవధి: ఒక ఏడాది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 04.08.2023.
ALSO READ:
ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏఈ పోస్టుల భర్తీకి మళ్లీ పరీక్షలు, షెడ్యూలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని పలు ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు జులై 20న పరీక్షల షెడ్యూలును విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. అక్టోబర్ 18 నుంచి 20 వరకు అసిస్టెంట్ ఇంజినీర్ కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష(సీబీఆర్‌టీ)లు నిర్వహించనున్నారు. వీటిలో అక్టోబరు 18, 19 తేదీల్లో సివిల్ ఇంజినీరింగ్ పోస్టులకు; అక్టోబరు 20న మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలో అభ్యర్థుల మార్కులను నార్మలైజేషన్ విధానంలో లెక్కించనున్నారు.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 400 ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
పుణె ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఆఫీసర్ స్కేల్ 2, 3 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ లేదా సీఏ, సీఎంఏ, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేపుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 25 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial