న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 132 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 132 (యూఆర్‌- 56, ఈడబ్ల్యూఎస్‌- 13, ఓబీసీ- 35, ఎస్సీ- 19, ఎస్టీ- 9)


* ఎగ్జిక్యూటివ్ పోస్టులు


రాష్ట్రాల వారీగా ఖాళీలు..


⏩ అస్సాం: 26


⏩ ఛత్తీస్‌గఢ్: 27


⏩ హిమాచల్ ప్రదేశ్: 12


⏩ జమ్మూ మరియు కాశ్మీర్: 07,


⏩ లడఖ్: 01


⏩ అరుణాచల్ ప్రదేశ్: 10


⏩ మణిపూర్: 09


⏩ మేఘాలయ: 08


⏩ మిజోరం: 06


⏩ నాగాలాండ్: 09


⏩ త్రిపుర: 05


⏩ ఉత్తరాఖండ్: 12 


అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 01.06.2023 నాటికి 21 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు ఫీజు:  రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీత భత్యాలు: నెలకు రూ.30,000.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 26.07.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16.08.2023.


Notification


Website



ALSO READ:


ఐఐటీ రూర్కీలో 78 గ్రూప్ బీ, సీ పోస్టులు, అర్హతలివే!
రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీఆర్) వివిధ గ్రూప్ బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 78 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీల్లో టీచింగ్‌ పోస్టులు, అర్హతలివే!
ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ దేశంలోని వివిధ కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/ బీఈడీ/ బీఈఎల్‌ఈడీ/ పీజీ/ డీఈఎల్‌ఈడీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్‌, టెట్‌ అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఐఐఎం కాశీపూర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
కాశీపుర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌, మాస్టర్స్‌ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడాని అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ఆగస్టు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial