IPPB Admitcard 2025: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబరు, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 14న రాతపరీక్ష నిర్వహించనున్నారు.
అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి.
పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 20 ప్రశ్నలు-20 మార్కులు, రీజనింగ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, మ్యాథమెటిక్స్ 40 ప్రశ్నలు-40 మార్కులు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు.
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ ఇలా..
➥ అడ్మిట్ కార్డుల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి-ibbponline.com.
➥ అక్కడ 'కెరీర్స్' విభాగానికి నావిగేట్ చేసి, 'ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్‌ఫార్మ్ కోసం స్పెషలిస్ట్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ .. కింద 'డౌన్‌లోడ్ అడ్మిట్ కార్డ్' అనే లింక్‌పై క్లిక్ చేయండి.
➥ అభ్యర్థులు 'రిజిస్ట్రేషన్ నంబర్ / రోల్ నంబర్' అండ్ 'పాస్‌వర్డ్' ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
➥ లాగిన్ అయిన తర్వాత, మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. ఇక్కడ అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.
పరీక్షా కేంద్రానికి తీసుకురావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్..
➥ పాన్ కార్డ్
➥ పాస్‌పోర్ట్
➥ పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్
➥ ఓటరు కార్డు
➥ బ్యాంక్ పాస్‌బుక్
➥ అభ్యర్థులు ఫోటోతో కూడిన ఐడి ప్రూఫ్ తీసుకెళ్లాలి. పరీక్షా కేంద్రంలో వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ డాక్యుమెంట్‌లు తీసుకెళ్లడం తప్పనిసరి.
న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ప్రధాన రెగ్యులర్/ ఒప్పంద ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 68 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్ మేనేజర్ ఐటీ- 54 పోస్టులు, మేనేజర్ ఐటీ- (పేమెంట్ సిస్టమ్స్)- 01 పోస్టు, మేనేజర్ ఐటీ(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నెట్‌వర్క్ & క్లౌడ్)- 02 పోస్టులు, మేనేజర్ ఐటీ(ఎంటర్‌ప్రైజ్ డేటా వేర్‌హౌస్)- 01 పోస్టు, సీనియర్ మేనేజర్ ఐటీ (పేమెంట్ సిస్టమ్స్)- 01 పోస్టు, సీనియర్ మేనేజర్ ఐటీ(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నెట్‌వర్క్ & క్లౌడ్)- 01 పోస్టు, సీనియర్ మేనేజర్- ఐటీ (వెండర్, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్, ప్రొక్యూర్‌మెంట్, ఎస్‌ఎల్‌ఏ, పేమెంట్స్)- 01 పోస్టు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) కాంట్రాక్టు- 07 పోస్టులు కేటాయించారు. పోస్టులను అనుసరించి విద్యార్హతలు నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. దరఖాస్తు ఫీజు రూ.750; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.150 చెల్లించాలి. అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ లేదా ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..