ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్‌) రిఫైనరీస్ డివిజన్.. పలు ట్రేడ్/టెక్నీషియన్/గ్రాడ్యుయేట్ విభాగాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఐవోసీఎల్‌ రిఫైనరీల్లో అప్రెంటిస్‌ శిక్షణకు నోటిఫికేషన్‌ విడుదలచేసింది. దీనిద్వారా మొత్తం 1746 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెట్రిక్యులేషన్, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీకాం ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 03లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు.


తమిళనాడు & పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, దాద్రా & నగర్ హవేలీ యొక్క యూటీ మరియు డామన్ & డయ్యూ, వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్, అస్సాం, సిక్కిం, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, యూటీ చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, యూటీ(జే&కే), యూటీ (లడఖ్), ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రిఫైనరీల్లో ఈ ఖాళీలున్నాయి. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 1746 (తెలంగాణ: 53, ఆంధ్రప్రదేశ్‌: 53)


* ట్రేడ్/టెక్నీషియన్/గ్రాడ్యుయేట్ అప్రెంటిస్


విభాగాలు: టెక్నీషియన్ అప్రెంటిస్-ఎలక్ట్రికల్, టెక్నీషియన్ అప్రెంటిస్-ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ట్రేడ్ అప్రెంటిస్ - ఫిట్టర్, ట్రేడ్ అప్రెంటిస్ -ఎలక్ట్రీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ -ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ట్రేడ్ అప్రెంటిస్ - మెషినిస్ట్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ - డేటా ఎంట్రీఆపరేటర్(ఫ్రెషర్స్), ట్రేడ్ అప్రెంటిస్ - డేటా ఎంట్రీ ఆపరేటర్(స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్లు) తదితరాలు.
అర్హత: మెట్రిక్యులేషన్, పన్నెండో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ డిప్లొమా/ఇంజినీరింగ్ డిగ్రీ/బీఏ/బీకామ్/బీఎస్సీ/డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


శిక్షణ కాలం: ఖాళీని అనుసరించి 12/15/24 నెలలు ఉంటుంది.


వయోపరిమితి: 31.12.2022 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్‌లో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


ముఖ్యమైనతేదీలు..


➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 14.12.2022.


➥ దరఖాస్తు చివరి తేది: 03.01.2023.


Notification


Website  


Also Read:


ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 596 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 60శాతం మార్కులతో బీఈ, బీటెక్(సివిల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్స్/ఆర్కిటెక్చర్) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా డిసెంబరు 22 నుంచి జనవరి 21లోగా దరఖాస్తుచేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ముంబ‌యి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్ రెగ్యులర్/ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంసీఏ/ ఎంఈ, ఎంటెక్/ ఎంఎస్సీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు నిర్ణీత మొత్తంలో దరఖాస్తు ఫీజు చెల్లించి.. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...