ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOCL) ట్రేడ్‌, టెక్నీషియన్‌ విభాగాల్లో 265 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీకి అక్టోబరు 28 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు, ఆసక్తి ఉన్నవారు నవంబరు 12న సాయంత్రం 5 గంటల్లోపు ఆన్‌లైన్‌ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


వివరాలు..


* అప్రెంటిస్‌ పోస్టులు


మొత్తం ఖాళీలు: 265


అర్హతలు: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టులను అనుసరించి అభ్యర్థులు ఇంటర్‌ లేదా డిప్లొమా, సంబంధిత ట్రేడ్‌లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 31.10.2022 నాటికి 18 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు కేటగిరీలవారీగా 10-15 సంవత్సరాల వరకు సడలింపు వర్తి్స్తుంది. 


అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


దరఖాస్తు ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా.


ముఖ్యమైన తేదీలు..


* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.10.2022.


* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.11.2021. (సా. 5 గంటల్లోపు)


Notification


Onine Application


Website


Also Read:


JIPMER Jobs: జిప్‌మర్‌‌లో 456 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(జిప్‌మర్) నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా డిప్లొమా(జనరల్ నర్సింగ్) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 7న ప్రారంభం అవుతుంది. సరైన అర్హతలు గల అభ్యర్ధులు డిసెంబర్ 1లోగా దరఖాస్తుచేసుకోవాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


హైదరాబాద్‌లో అప్రెంటిస్‌షిప్ మేళా - డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అర్హత!
హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) సంస్థ వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహిస్తోంది. డిప్లొమా, బీటెక్, ఏదైనా సాధారణ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు మేళాకు హాజరుకావచ్చు. నవంబరు 10న అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నారు. 
వాక్‌ఇన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో అప్రెంటిస్‌షిప్‌లు, వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL) 2022-23 సంవత్సరానికి ఏడాది టెక్నీషియన్, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. పోస్టుని అనుసరించి బీఈ, బీటెక్, డిప్లొమా, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. డిప్లొమా/ ఇంజినీరింగ్ డిగ్రీ/ గ్రాడ్యుయేషన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు, ఇంటర్వ్యూ మరియు రాత పరీక్ష లేదు. వాక్-ఇన్ నవంబర్ 09న నిర్వహిస్తారు. ఆసక్తి గల అభ్యర్ధులు సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా వాక్-ఇన్‌కు హాజరుకావాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...