కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ రీజియన్‌లో 47 ఖాళీలు ఉండగా, విజయవాడ రీజియన్‌లో 7 ఖాళీలు మాత్రమే ఉన్నాయి.


పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత, స్థానిక భాష తెలిసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబర్‌ 5 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. నవంబరు 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపడతారు.


పోస్టుల వివరాలు...

* ఖాళీల సంఖ్య: 1671 పోస్టులు

1) సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్: 1,521 పోస్టులు (హైదరాబాద్-45, విజయవాడ-05)
అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన విద్యా్ర్హత ఉండాలి. స్థానిక భాష తెలిసి ఉండాలి.
వయోపరిమితి: 25.11.22 నాటికి 27 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, డిపార్ట్‌మెంటల్ ఉద్యోగులకు 40 ఏళ్లవరకు సడలింపు వర్తిస్తుంది. 

2) మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్‌): 150 పోస్టులు (హైదరాబాద్-02, విజయవాడ-02)
అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన విద్యా్ర్హత ఉండాలి. స్థానిక భాషలు తెలిసి ఉండాలి.
వయోపరిమితి: 25.11.22 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, డిపార్ట్‌మెంటల్ ఉద్యోగులకు 40 ఏళ్లవరకు సడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు, పరీక్ష ఫీజు: రూ.500 చెల్లించాలి. ఇందులో రూ.50 పరీక్ష ఫీజు కాగా, రూ.450 రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీల కింద వసూలుచేస్తారు. అభ్యర్థులందరూ కచ్చితంగా రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వర్గాలకు చెందిన పురుష అభ్యర్థులు అదనంగా పరీక్ష ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: టైర్-1, టైర్-2, టైర్-3 పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: 



జీత భత్యాలు: సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.21,700 - రూ.69,100, ఎంటీఎస్‌ పోస్టులకు రూ.18,000-రూ.56,900 చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.11.2022.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 25.11.2022.


Notification
Website


:: Also Read ::


SSC Recruitment: 24,369 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ! దరఖాస్తు చేసుకోండి! (చివరి తేది: 30.11.2022)
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ)-2022 నోటిఫికేషన్‌ విడుదలైంది. దీనిద్వారా వివిధ కేంద్ర బలగాల్లో 24,369 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో పురుషులకు 21,579 పోస్టులు, మహిళలకు 2626 పోస్టులు కేటాయించారు. పదో తరగతి ఉత్తీర్ణత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


 


DRDO Jobs: డీఆర్‌డీఓలో 1061 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఈ అర్హతలు ఉండాలి! (చివ‌రితేది: 07.12.2022)
భార‌త ర‌క్షణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గనేజేష‌న్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని సెంట‌ర్ ఫ‌ర్ ప‌ర్సన‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో 1061 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...