Intelligence Bureau Admit Cards: ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్ (SA), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగ నియామక పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో డిసెంబర్ 20న పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 677 సెక్యూరిటీ అసిస్టెంట్, ఎంటీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి అక్టోబరు 14 నుంచి నవంబరు 13 వరకు దరఖాస్తులు స్వీకరించారు. డిసెంబరు 20న రాతపరీక్ష జరుగనుంది. ఖాళీలవారీగా టైర్-1 రాతపరీక్ష (ఆబ్జెక్టివ్), టైర్-2 రాత పరీక్ష (డిస్క్రిప్టివ్), డ్రైవింగ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..
రాతపరీక్ష విధానం:
టైర్-1 పరీక్ష: మొత్తం 100 మార్కులకు టైర్-1 పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఇందులో జనరల్ అవేర్‌నెస్-40 మార్కులు-40 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు-20 మార్కులు, న్యూమరికల్/అనలిటికల్/లాజికల్ ఎబిలిటీ & రీజనింగ్-20 ప్రశ్నలు-20 మార్కులు, ఇంగ్లిస్ లాంగ్వేజ్-20 ప్రశ్నలు-20 మార్కులు, పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానిక 0.25 మార్కులు కోత విధిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలు (ఒక గంట).
టైర్-2 పరీక్ష (ఎస్ఏ/ఎంటీ): మొత్తం 50 మార్కులకు టైర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్ పోస్టులకు డ్రైవింగ్ టెస్ట్ కమ్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పరీక్షకు ఎలాంటి నిర్దిష సమయమంటూ లేదు. కనీస అర్హత మార్కులను 40 శాతంగా నిర్ణయించారు. అలాగే ఎంటీఎస్ పోస్టులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ (ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్) నిర్వహిస్తారు. డిస్క్రిప్టివ్ పరీక్ష సమయం 60 నిమిషాలు. కనీస అర్హత మార్కులను 20 శాతంగా నిర్ణయించారు.
జీతం: సెక్యూరిటీ అసిస్టెంట్/మోటాన్ ట్రాన్స్‌పోర్ట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.18,000 - రూ.56,900 జీతంగా చెల్లిస్తారు.
ALSO READ:
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో టెక్నీషియన్ పోస్టులు - పది, ఐటీఐ అర్హతతో రూ.69వేల జీతం
హైదరాబాద్‌లోని ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 54 టెక్నీషియన్ పోస్టులను భర్తీచేయనున్నారు. పదోతరగతితోపాటు, సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అర్హతలున్న అభ్యర్థులు డిసెంబరు 31లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. దీంతోపాటు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..