ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (CRP SPL-XII) ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ జనవరి 17న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. జనవరి 25 వరకు ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి. ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ప్రిలిమ్స్ పరీక్షలను డిసెంబర్ 24 నుండి 31 వరకు దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన సంగతి తెలిసిందే. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 29న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.


ఫలితాలను ఇలా చెక్ చేయండి..


Step 1: ఫలితాల కోసం అభ్యర్థులు మొదటగా ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. 


Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'IBPS SO (CRP SPL-XII) Prelims Results 2022' లింక్‌పై క్లిక్ చేయాలి.


Step 3: లాగిన్ పేజీలో అభ్యర్థి తన రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేయాలి.


Step 4: అభ్యర్థికి సంబంధించిన ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్‌పై దర్శమిస్తుంది.


Step 5: ఫలితాలకు సంబంధించిన పేజీని డౌన్‌లోడ్ తీసుకొని, ప్రింట్ తీసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి. 


ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


మెయిన్ పరీక్ష ఇలా..



ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.11.2022.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.11.2022.


➥ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ (ప్రిలిమినరీ పరీక్ష): డిసెంబర్ 2022.


➥ ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 24.12.2022, 31.12.2022.


➥ ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి: జనవరి, 2023.


➥ ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: జనవరి, 2023.


➥ ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేదీ: 29.01.2023.


➥ తుది పరీక్ష ఫలితాల ప్రకటన: ఫిబ్రవరి, 2023.


➥ ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్: ఫిబ్రవరి, 2023.


➥ ఇంటర్వ్యూ నిర్వహణ: ఫిబ్రవరి/ మార్చి, 2023.


➥ ప్రొవిజినల్ అలాట్‌మెంట్:  ఏప్రిల్, 2023.


IBPS Exam Calendar: ఐబీపీఎస్ ఎగ్జామ్ క్యాలెండర్ 2023 (క్లర్క్, పీవో, ఆఫీసర్ పరీక్షల తేదీలు) కోసం క్లిక్ చేయండి.. 


Also Read:


LIC AAO Recruitment: డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీలో ఉద్యోగాలు, నెలకు 92 వేల రూపాయల జీతం!
ప్రభుత్వరంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. డిగ్రీతో సంబంధిత విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌ు రూ.85 చెల్లిస్తే సరిపోతుంది. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఐబీపీఎస్, ఎస్‌బీఐ పీవో పరీక్షలకు సన్నద్ధం అవుతున్నవాళ్లు, గతంలో పరీక్ష రాసినవాళ్లు ప్రాథమిక పరీక్షలో సులభంగా రాణించవచ్చు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 15 నుంచి 31 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


➥ నేషనల్ హౌజింగ్ బ్యాంకులో 36 మేనేజర్, ఆఫీసర్ పోస్టులు - అర్హతలివే!

➥ కేంద్ర కొలువులకు నోటిఫికేషన్, 111 ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రారంభం!


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...