దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ ఆన్‌లైన్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అక్టోబరు 18న ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలకాగా.. అక్టోబరు 25న స్కోరు కార్డులను అందుబాటులో ఉంచారు. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైనవారు నవంబర్ 5 వరకు స్కోరుకార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రోల్ నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి స్కోర్ కార్డులు పొందవచ్చు. 

ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ స్కోరు కార్డు కోసం క్లిక్ చేయండి..

IBPS PO Results: ఐబీపీఎస్ పీవో ఫలితాల కోసం క్లిక్ చేయండి..

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్ పీవో/ ఎంటీ-XIII 2024-25) ప్రకటన ద్వారా మొత్తం 3,049 పీవో ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 1 నుంచి 28 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు చేసుకున్నవారికి సెప్టెంబర్ 23, 30, అక్టోబర్ 1 తేదీల్లో ప్రిలిమ్స్ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించిన అధికారులు.. తాజాగా స్కోరు కార్డును అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఐబీపీఎస్ మెయిన్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామ్ నిర్వహించి పీవో పోస్టులను భర్తీచేస్తారు. 

మెయిన్స్ పరీక్ష విధానం:

విభాగం  ప్రశ్నలు  మార్కులు   సమయం
రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌  45 60 60 నిమిషాలు
జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌  40 40 35 నిమిషాలు
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌   35 40 40 నిమిషాలు
డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ 35 60 45 నిమిషాలు
మొత్తం  155 200 3 గంటలు

పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

కాకినాడ సహకార బ్యాంకులో 33 ఆఫీసర్, క్లర్క్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
కాకినాడలోని కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ పలు శాఖల్లో ఆఫీసర్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆఫీసర్ క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అసిస్టెంట్ సీఈవో, మేనేజర్ పోస్టులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
పూణేలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్నవారు నవంబరు 6లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇంటర్ అర్హతతో 436 ఎయిర్‌పోర్ట్ కొలువులు - ఎంపిక ఇలా!
న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్‌ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్, దేశవ్యాప్తంగా ఏఏఐసీఎల్‌ఏఎస్‌ కేంద్రాల్లో అసిస్టెంట్(సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇంటర్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..