IBPS PO Mains Results: దేశంలోని వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 3049  ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఐబీపీఎస్ మెయిన్స్ ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(IBPS) జనవరి 30న విడుదలచేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేది వివరాలు నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలు ఫిభ్రవరి 6 వరకు అందుబాటులో ఉంటాయి.


ఐబీపీఎస్ పీవో మెయిన్స్‌ రిజల్ట్స్ ఇలా చెక్ చేయండి..


➥ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట ఐబీపీఎస్ వెబ్‌సైట్ సందర్శించాలి.-https://www.ibps.in/


➥ అక్కడ హోంపేజీలో కనిపించే ఐబీపీఎస్ పీవో మెయిన్స్‌ ఫలితాల కోసం CRP PO/MT-XIII results లింక్‌పై క్లిక్ చేయాలి.


➥ లాగిన్ పేజీలో అవసరమైన వివరాలు నమోదు చేసి సమర్పించాలి. 


➥ అభ్యర్థుల స్కోర్ వివరాలతో కూడిన ఫలితాలు కనిపిస్తాయి. దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి.


ఐబీపీఎస్ పీవో మెయిన్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పీవో/ ఎంటీ ఖాళీల భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్‌ పీవో/ ఎంటీ-XIII 2024-25) ప్రకటనను సెప్టెంబరు 30న నోటిఫికేషన్ (సీఆర్‌పీ-పీవో XIII) విడుదల చేసిన సంగతి తెలిసిందే. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఆగస్టు 1 నుంచి 21 వరకు దరఖాస్తులు స్వీకరించారు. పీవో పోస్టులకు సంబంధించి సెప్టెంబరు 23, 30; అక్టోబరు 1న 'ప్రిలిమ్స్' పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను అక్టోబరు 18న విడుదల చేశారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించినవారికి నవంబర్‌ 5న మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 3,049 పోస్టులు భర్తీ చేయనున్నారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ ఎగ్జామ్‌ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.


బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు:


➥ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2000


➥ కెనరా బ్యాంక్: 500


➥ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 224


➥ పంజాబ్ నేషనల్ బ్యాంక్: 200


➥ పంజాబ్ సింధ్ బ్యాంక్: 125


ముఖ్యమైన తేదీలు...


➥ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ‌ ప్రారంభం: 01.08.2023


➥ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 21.08.2023


➥ ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెట‌ర్‌ డౌన్‌లోడ్‌: సెప్టెంబ‌ర్‌ 2023


➥ ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్: సెప్టెంబ‌ర్‌ 2023


➥ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష(ఆన్‌లైన్) కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: సెప్టెంబ‌ర్‌ 2023


➥ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష: సెప్టెంబ‌ర్‌/అక్టోబరు 2023


➥ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు: అక్టోబరు 2023


➥ మెయిన్ ఎగ్జామ్ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: అక్టోబరు/న‌వంబ‌రు 2023


➥ మెయిన్ ఎగ్జామ్: న‌వంబ‌రు 2023


➥ మెయిన్ ఎగ్జామ్ ఫ‌లితాలు: డిసెంబ‌రు 2023


➥ ఇంట‌ర్వ్యూ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: జ‌న‌వ‌రి/ఫిబ్రవరి 2024


➥ ఇంట‌ర్వ్యూ: జ‌న‌వ‌రి/ఫిబ్రవరి 2024


➥ నియామకం: ఏప్రిల్ 2024.


ALSO READ:


అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు, పరీక్షల షెడ్యూలు వెల్లడి
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అసిస్టెంట్‌ లోకో పైలట్‌(ఏఎల్‌పీ) కొలువులకు ఆర్‌ఆర్‌బీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌లో అభ్యర్థుల వయోపరిమితిని 18-30 సంవత్సరాలుగా పేర్కొన్నారు. అయితే వయోపరిమితిని మూడేళ్లు పెంచుతున్నట్లు రైల్వేశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాజా నిర్ణయం ప్రకారం ఏఎల్‌పీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు జులై 1 నాటికి 18-33 సంవత్సరాలలోపు ఉండాలని తెలిపింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..