ఐబీపీఎస్ పీవో/ఎంటీ మెయిన్స్ పరీక్ష అడ్మిట్ కార్డులను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అక్టోబరు 26న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డు పొందవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 5న ఐబీపీఎస్ పీవో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్ష తేదీ వరకూ అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఐబీపీఎస్ మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
అడ్మిట్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
Step 1: అడ్మిట్ కార్డు కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ibps.in
Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'Download Online Mains Exam Call Letter for IBPS PO' లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 3: క్లిక్ చేయగానే వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ వివరాలు నమోదుచేయాలి.
Step 4: వివరాలు నమోదుచేసి సబ్‌మిట్ చేయగానే అభ్యర్థుల వివరాలు, పరీక్ష కేంద్రం వివరాలతో కూడిన అడ్మిట్ కార్డు దర్శనమిస్తుంది.
Step 5: అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. పరీక్షరోజు తప్పనిసరిగా వెంటతీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డుతోపాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును వెంటతీసుకెళ్లడం మంచిది.
IBPS PO మెయిన్స్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) సెప్టెంబరు 30న నోటిఫికేషన్ (సీఆర్‌పీ-పీవో XIII) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ సెప్టెంబరు 23, 30; అక్టోబరు 1న 'ప్రిలిమ్స్' పరీక్షను నిర్వహించింది. పరీక్ష ఫలితాలను అక్టోబరు 18న విడుదల చేసింది. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నవంబరు 5న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులను తాజాగా ఐబీపీఎస్ విడుదల చేసింది.
మెయిన్స్ పరీక్ష విధానం:
విభాగం | ప్రశ్నలు | మార్కులు | సమయం |
రీజనింగ్ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ | 45 | 60 | 60 నిమిషాలు |
జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్ | 40 | 40 | 35 నిమిషాలు |
ఇంగ్లిష్ లాంగ్వేజ్ | 35 | 40 | 40 నిమిషాలు |
డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ | 35 | 60 | 45 నిమిషాలు |
మొత్తం | 155 | 200 | 3 గంటలు |
పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
పూణేలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్నవారు నవంబరు 6లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కాకినాడ సహకార బ్యాంకులో 33 ఆఫీసర్, క్లర్క్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
కాకినాడలోని కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ పలు శాఖల్లో ఆఫీసర్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆఫీసర్ క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అసిస్టెంట్ సీఈవో, మేనేజర్ పోస్టులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..