Institute for Plasma Research: గుజరాత్‌ రాష్ట్రం గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రిసెర్చ్‌(ఐపీఆర్‌), డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంఎస్సీ ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 18లోగా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు చేపడతారు.


వివరాలు..


* టెక్నికల్‌ ఆఫీసర్‌-సి: 22 పోస్టులు


పోస్టుల కేటాయింపు: జనరల్-11, ఎస్సీ-03, ఎస్టీ-01, ఓబీసీ-05, ఈడబ్ల్యూఎస్-02. వీటిలో 4 పోస్టులు దివ్యాంగులకు కేటాయించారు.


విభాగాలు: కంప్యూటర్‌, ఫిజిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రికల్‌.


అర్హత: 60 శాతం మార్కులో సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ ఎంఎస్సీ (ఫిజిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: దరఖాస్తు గడువు ముగిసే సమయానికి 30 సంవత్సరాలకు మించకూడదు. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


దరఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.


ఎంపిక విధానం: దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


జీతం: నెలకు రూ.56,100 చెల్లిస్తారు.


ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 18.12.2023. (5.30 P.M)


Notification


Online Application


Online Payment


Website


ALSO READ:


సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1,785 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే
కోల్‌కతా ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే (SER)-రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(RRC) వివిధ డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపునిచ్చారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1,104 అప్రెంటిస్ పోస్టులు
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్ఆర్‌సీ)- నార్త్ ఈస్ట్రన్ రైల్వే ఎన్‌ఈఆర్‌ పరిధిలోని డివిజన్‌/ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1104 పోస్టులను భర్తీచేయనున్నారు. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply