ITBP Recruitment: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ) గ్రూప్-సి (నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌) విభాగంలో హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సెలర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 112 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ(సైకాలజీ) లేదా డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత ఉన్నవారు దరకాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులు రూ.100. చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్- సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 8 వరకు దరఖాస్తులు పమర్పించవచ్చు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 112


పోస్టుల కేటాయింపు: జనరల్-37, ఎస్సీ- 15, ఎస్టీ- 7, ఓబీసీ- 24, పురుషులు- 96, మహిళలు- 16) 


* హెడ్ ​​కానిస్టేబుల్(ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సెలర్)


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ(సైకాలజీ) లేదా తత్సమానం లేదా డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్ లేదా తత్సమానం కలిగి ఉండాలి. 


వయోపరిమితి: 05.08.2024 నాటికి 20 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎక్స్- సర్వీస్‌మెన్(ఓబీసీ(ఎస్‌సీఎల్) ) అభ్యర్థులకు 6 సంవత్సరాలు, ఎక్స్- సర్వీస్‌మెన్(ఎస్సీ, ఎస్టీ) అభ్యర్థులకు 8 సంవత్సరాలు, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది. 


దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్- సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా. 


జీత భత్యాలు: రూ.25,500 - రూ.81,100. 


ముఖ్యమైనతేదీలు..


✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.07.2024.


✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.08.2024.


Notification


Online Application


Website



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..