ముంబయిలోని ఐఆర్‌ఈఎల్ (ఇండియా) లిమిటెడ్- రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ ప్రాజెక్టులు, యూనిట్లు, కార్యాలయాల్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు నవంబరు 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపిక చేపడతారు.
వివరాలు..
* ఖాళీల సంఖ్య: 32
పోస్టుల కేటాయింపు: జనరల్-16, ఈడబ్ల్యూఎస్-03, ఓబీసీ-08, ఎస్సీ-04, ఎస్టీ-01.
➥ జూనియర్ రాజభాష అధికారి: 04 పోస్టులు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్). హిందీ తప్పనిసరి సబ్జెక్టుగా చదివి ఉండాలి. (లేదా) మాస్టర్స్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్). ఇంగ్లిష్/హిందీ ఒక తప్పనిసరి సబ్జె్క్టుగా చదివి ఉండాలి.
అనుభవం: డిగ్రీ అర్హతతో 3 సంవత్సరాలు, పీజీ అర్హతతో ఏడాది అనుభవం ఉండాలి.
➥ జూనియర్ సూపర్‌వైజర్ (కెమికల్): 04 పోస్టులు
అర్హత: డిప్లొమా (ఇంజినీరింగ్) లేదా డిగ్రీ (సైన్స్) ఉండాలి. డిగ్రీలో కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టుగా ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాలు.
➥ జూనియర్ సూపర్‌వైజర్ (అడ్మిన్): 04 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీ.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాలు.
➥ మైనింగ్ మేట్: 08 పోస్టులు
అర్హత: హెచ్‌ఎస్‌సీ (పదోతరగతి) అర్హతతోపాటు డీజీఎంఎస్ జారీచేసిన మైనింగ్ మేట్ ఆఫ్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాలు.
➥ మైనింగ్ సర్వేయర్: 01 పోస్టులు
అర్హత: డిప్లొమా (మైన్స్ సర్వే/మైనింగ్ ఇంజినీరింగ్)తోపాటు డీజీఎంఎస్ జారీచేసిన ఆఫ్ కాంపిటెన్సీ ఇన్ మైనింగ్ సర్వే సర్టిఫికేట్ ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాలు.
➥ మైనింగ్ ఫోర్‌మాన్: 04 పోస్టులు
అర్హత: డిప్లొమా (మైనింగ్) తోపాటు డీజీఎంఎస్ జారీచేసిన ఫోర్‌మ్యాన్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 6 సంవత్సరాలు.
➥ సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్): 02 పోస్టులు
అర్హత: మూడేళ్ల డిప్లొమా (ఎలక్ట్రికల్) తోపాటు ఎలక్ట్రికల్ సర్వేయర్ సర్టిఫికేట్ ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 6 సంవత్సరాలు.
➥ సూపర్‌వైజర్ (సివిల్): 02 పోస్టులు
అర్హత: మూడేళ్ల డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) తోపాటు ఎలక్ట్రికల్ సర్వేయర్ సర్టిఫికేట్ ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 6 సంవత్సరాలు.
➥ సూపర్‌వైజర్ (ఫైనాన్స్): 03 పోస్టులు
అర్హత: డిగ్రీ/పీజీ డిగ్రీ (కామర్స్)
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 6 సంవత్సరాలు
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 14.11.2023.
ALSO READ:
బీఈఎంఎల్ లిమిటెడ్‌లో 101 ఎగ్జిక్యూటివ్ పోస్టులు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
కృష్ణా జిల్లాలో 164 పారామెడికల్ పోస్టులు - అర్హతలు, ఎంపిక విధానం ఇలా