IOCL Recruiment: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) మార్కెటింగ్ డివిజన్‌లో వివిధ ప్రదేశాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఆపరేటర్‌, జూనియర్‌ అటెండెంట్‌, జూనియర్ బిజినెస్‌ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 246 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిబ్రవరి 03న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తు ఫీజు రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్టు, ఫిజికల్ టెస్ట్‌ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 246


* నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు


⏩ జూనియర్ ఆపరేటర్‌ గ్రేడ్‌-1: 215 పోస్టులు


రాష్ట్రాల వారీగా ఖాళీలు..


➥ హర్యానా- 02 పోస్టులు


➥ హిమాచల్ ప్రదేశ్- 04 పోస్టులు


➥ జమ్మూ & కాశ్మీర్- 01 పోస్టు


➥ లడఖ్- 06 పోస్టులు


➥ పంజాబ్- 12 పోస్టులు


➥ రాజస్థాన్- 06 పోస్టులు


➥ ఉత్తరప్రదేశ్- 45 పోస్టులు


➥ ఉత్తరాఖండ్- 08 పోస్టులు


➥ అరుణాచల్ ప్రదేశ్- 03 పోస్టులు


➥ అస్సాం- 10 పోస్టులు


➥ బీహార్- 09 పోస్టులు


➥ నాగాలాండ్- 07 పోస్టులు


➥ వెస్ట్ బెంగాల్- 02 పోస్టులు


➥ ఛత్తీస్‌గఢ్- 08 పోస్టులు


➥ మధ్యప్రదేశ్- 21 పోస్టులు


➥ మహారాష్ట్ర- 21 పోస్టులు


➥ దాద్రా & నగర్ హవేలి అండ్ డామన్ & డయ్యూ- 02


➥ ఆంధ్రప్రదేశ్- 18 పోస్టులు


కర్ణాటక- 12 పోస్టులు


➥ కేరళ- 03 పోస్టులు


➥ పుదుచ్చేరి- 01 పోస్టు


➥ తమిళనాడు- 13 పోస్టులు


➥ తెలంగాణ- 01 పోస్టు


⏩ జూనియర్‌ అటెండెంట్‌ గ్రేడ్‌-1: 23 పోస్టులు


రీజియన్‌ల వారీగా ఖాళీలు..


➥ నార్తర్న్ రీజియన్- 11 పోస్టులు


➥ ఈస్టర్న్ రీజియన్- 04 పోస్టులు


➥ వెస్టర్న్ రీజియన్- 01 పోస్టు


➥ సదరన్ రీజియన్- 07 పోస్టులు


⏩ జూనియర్ బిజినెస్‌ అసిస్టెంట్ గ్రేడ్‌-3: 08 పోస్టులు


రీజియన్‌ల వారీగా ఖాళీలు..


➥ నార్తర్న్ రీజియన్- 01 పోస్టు


➥ ఈస్టర్న్ రీజియన్- 01 పోస్టు


➥ వెస్టర్న్ రీజియన్- 03 పోస్టులు


➥ సదరన్ రీజియన్- 03 పోస్టులు


అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 31.01.2025 నాటికి 18 - 26 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్టు, ఫిజికల్ టెస్ట్‌ ఆధారంగా.


జీతం: నెలకు జూనియర్‌ ఆపరేటర్‌, జూనియర్‌ అటెండెంట్‌ గ్రేడ్‌-1 పోస్టులకు రూ.23,000 - రూ.78,000, జూనియర్ బిజినెస్‌ అసిస్టెంట్ గ్రేడ్‌-3 పోస్టుకు రూ.25,000 - రూ.1,05,000.


ముఖ్యమైన తేదీలు..


🔰 నోటిఫికేషన్ వెల్లడి: 01.02.2025. 


🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.02.2025.


🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23.02.2025.


Notification


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..