IOCL Recruiment: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ఖాళీగా ఉన్న అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 97 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంఎస్సీ(కెమిస్ట్రీ) /తత్సమాన విభాగాల్లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.


వివరాలు..


ఖాళీల సంఖ్య: 97


* అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్స్


రిజర్వేషన్: యూఆర్- 45, ఎస్సీ- 13, ఎస్టీ-06, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 24, ఈడబ్ల్యూఎస్- 09. 


అర్హత: 
➥ గుర్తింపు పొందిన యూనివర్సిటి/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి కెమిస్ట్రీ/తత్సమాన తత్సమాన విభాగంలో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి.
➥ ఎంఎస్సీ(కెమిస్ట్రీలో ఇనార్గానిక్/ఆర్గానిక్/ఎనలిటికల్/ఫిజికల్/అప్లైడ్ కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ)/తత్సమాన విభాగంలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
➥ కెమిస్ట్రీలోని ఏదైనా ఇతర శాఖ ఉదా. బయోకెమిస్ట్రీ, ఫార్మసీ, టాక్సికాలజీ, జియోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫుడ్ టెక్నాలజీ మొదలైనవి అర్హత కింద తీసుకోబడదు. 
➥ జనరల్/ఓబీసీ(ఎన్‌సీఎల్)/ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు డిగ్రీ పరీక్షలో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణలై ఉండాలి.
➥ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు డిగ్రీ పరీక్షలో కనీసం మార్కులను 55% మార్కులతో ఉత్తీర్ణలై ఉండాలి.
➥ ఫుల్‌టైమ్ రెగ్యులర్ కోర్సు ద్వారా డిగ్రీ ఉల్లీర్ణత కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.


అనుభవం: కనీసం 02 సంవత్సరాల అనుభవం ఉండాలి. పెట్రోలియం/పెట్రో-కెమికల్/పాలిమర్/ఫెర్టిలైజర్ యూనిట్ లేబొరేటరీస్‌లో టెస్టింగ్/ఆర్&డీ/క్వాలిటీ కంట్రోల్‌లో అనుభవం ఉండాలి. లేదా NABL గుర్తింపు పొందిన ప్రయోగశాలలో అనుభవం. ల్యాబ్ "టెస్టింగ్" ఫీల్డ్‌లో  "కెమికల్" విభాగంలో గుర్తింపు పొందినట్లయితే మాత్రమే అనుభవం చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించబడుతుంది.  ల్యాబ్‌లో గ్రూప్: లూబ్రికెంట్స్/పెట్రోలియం మరియు ప్రొడక్ట్స్ కింద స్కోప్ ఉండాలి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, బయోలాజికల్, రేడియోలాజికల్, NDT మొదలైన విభాగాలలో అనుభవం పరిగణించబడదు. అకడమిక్ ఇన్‌స్టిట్యూట్‌లో టీచింగ్ & రీసెర్చ్ అనుభవం సంబంధిత అనుభవంగా పరిగణించబడదు. 


వయోపరిమితి: 28.02.2025 నాటికి గరిష్టంగా జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. ఓబీసీ (నాన్ క్రీమీ లేయర్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఎక్స్- సర్వీస్‌మెన్ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.


దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ(ఎన్‌సీఎల్)/ఈడబ్ల్యూఎస్ లభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.


ఆన్‌లైన్‌ టెస్ట్: ఆన్‌లైన్‌ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. పరీక్షకు 120 నిమిషాల వ్యవధి ఉంటుంది. రెండు భాగాలు- జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ డిసిప్లిన్ నాలెడ్జ్. ఇందులో 135 ప్రశ్నలు ఉంటాయి. ఓక్కో ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. సీబీటీని ఒకే రోజులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సెషన్లలో నిర్వహించవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఇంగ్లీషు మరియు హిందీలో మాత్రమే నిర్వహించబడుతుంది. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉండదు. 


జీతం: రూ.40,000 నుంచి రూ.1,40,000 ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 1.03.2025.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 21.03.2025.


Notification


Online Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...