IOCL Recruitment: చెన్నైలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) సదరన్ రీజియన్, మార్కెటింగ్ డివిజన్ కింద పేర్కొన్న విభాగాల్లో 2025-26 సంవత్సరానికిగాను ట్రేడ్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 200 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోవ తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీబీఏ, బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. షార్ట్‌లిస్టింగ్, మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అప్రెంటిస్‌ శిక్షణకు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చెరి, కర్ణాటక, కేరళలో విధిగా పనిచేయాల్సి ఉంటుంది.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 200

⏩ ట్రేడ్ ఐటిఐ అప్రెంటిస్‌ పోస్టులు 

రాష్ట్రాలవారీగా ఖాళీలు..

* తమిళనాడు & పుదుచ్చేరి: 05 పోస్టులు

* కర్ణాటక: 05 పోస్టులు

* కేరళ: 15 పోస్టులు

* ఆంధ్రప్రదేశ్: 15 పోస్టులు

* తెలంగాణ: 15 పోస్టులు

విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్.

అర్హతలు: పదోవ తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ ద్వారా గుర్తింపు పొందిన ఐటిఐ కోర్సు ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 31.01.2025 నాటికి 18 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ(జనరల్- 10 సంవత్సరాలు, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 13 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ- 15 సంవత్సరాలు) అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

⏩ టెక్నీషియన్ అప్రెంటిస్‌ పోస్టులు 

రాష్ట్రాలవారీగా ఖాళీలు..

* తమిళనాడు & పుదుచ్చేరి: 05 పోస్టులు

* కర్ణాటక: 05 పోస్టులు

* కేరళ: 05 పోస్టులు

* ఆంధ్రప్రదేశ్: 05 పోస్టులు

*తెలంగాణ: 05 పోస్టులు

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌. 

అర్హతలు: సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 31.01.2025 నాటికి 18 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ(జనరల్- 10 సంవత్సరాలు, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 13 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ- 15 సంవత్సరాలు) అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

⏩ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ పోస్టులు  

రాష్ట్రాలవారీగా ఖాళీలు..

* తమిళనాడు & పుదుచ్చేరి: 35 పోస్టులు

* కర్ణాటక: 15 పోస్టులు

* కేరళ: 40 పోస్టులు

* ఆంధ్రప్రదేశ్: 15 పోస్టులు

* తెలంగాణ: 15 పోస్టులు

అర్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 31.01.2025 నాటికి 18 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ(జనరల్- 10 సంవత్సరాలు, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 13 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ- 15 సంవత్సరాలు) అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

శిక్షణ వ్యవధి: ఏడాది.

శిక్షణ కేంద్రాలు: తమిళనాడు, పుదుచ్చెరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. 

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.01.2025.

🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16.02.2025.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..